Moviesతెలిసి తప్పు చేస్తున్న విజయ్ దేవరకొండ..మహేష్ ఏం మాట్లాడరా..?

తెలిసి తప్పు చేస్తున్న విజయ్ దేవరకొండ..మహేష్ ఏం మాట్లాడరా..?

యూత్ హీరోగా మంచి పాపులారిటీ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నధ్ తో కలిసి ” లైగర్” అనే సినిమా చేస్తున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ గీతా గోవిందంతో సూపర్ హిట్ అందుకుని 100 కోట్ల క్లబ్ లో కూడా చేరాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండకు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో పాన్ ఇండియా మూవీగా రాబోతున్న లైగర్ సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‏గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

అయితే ఈ సినిమాను సమ్మర్ కానుకగా ఏప్రిల్ 1న విడుద‌ల చేయాల‌ని నిర్మాతలు పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి, క‌రణ్ జో హార్ భావిస్తున్న‌ట్లు మీడియాలో టాక్ వినిపిస్తుంది. కానీ ఇక్కడ ట్వీస్ట్ ఏమిటంటే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో పరశూరాం డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం “సర్కారు వారి పాట” సినిమా కూడా ఏప్రిల్ 1న విడుద‌ల చేస్తామని ఇది వరకే ప్రకటించేసారు. ఇప్పుడి ఈ రెండు సినిమాల్లో ఒక సినిమా వెనకి తగ్గపోతే కలెక్షన్స్ పరంగా ఖచ్చితంగా ఓ సినిమా దెబ్బైపోతుంది. రెండు సినిమాల కోసం వాళ్ల అభిమానులు ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నారు.

పూరీ జ‌గన్నాథ్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న లైగ‌ర్‌కు మంచి క్రేజే ఉంది. సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత మహేష్ చేస్తున్న సర్కారు వారి పాట అనే సినిమాకు మంచి డిమాండింగ్ ఉంది. ఈ క్రమంలో ఇద్దరు చిత్ర నిర్మాతలు మాట్లాడుకుని ఓ నిర్ణయానికి వస్తే బాగుండూ అంతున్నారు అభిమానులు. నిజానికి మహేష్ తో పోల్చుకుంటే విజయ్ స్టామీనా కొంచెం తక్కువే..కానీ, పూరీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై ఓ రేంజ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. సో.. బాక్సాఫీస్ వ‌ద్ద మ‌హేశ్‌కు మంచి పోటీనే అవుతుంద‌న‌డంలో సందేహం లేదు.

Latest news