Movies"పుష్ప" ప్రీరిలీజ్ కు ప్రభాస్ ఛీప్ గెస్ట్..ఐడియా ఇచ్చింది ఎవరో తెలుసా..?

“పుష్ప” ప్రీరిలీజ్ కు ప్రభాస్ ఛీప్ గెస్ట్..ఐడియా ఇచ్చింది ఎవరో తెలుసా..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుముమార డైరెక్షన్ లో “పుష్ప” అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. అల్ వైకుంఠపురం లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత చేసిన సినిమా కావడంతో అభిమానులు భారీ ఎంచనాలు పెట్టుకున్నారు. పైగా క్రేజీ కాంబో సుకుమార్ తో సినిమా అంటే ఇంక అభిమానులు అంచనాలు వేరే లెవల్ లో ఉంటాయి. వాటిని రీచ్ అవ్వాలంటే చాలా కష్టం. కానీ అభిమానులను ఉత్సాహపరచడానికి బన్నీ ఎంత దూరమైన వెళ్తాడు అనే విషయం మనకు తెలిసిందే.

కాగా ఈ సినిమాలో ఫస్ట్ టైం రష్మిక మందన అల్లు అర్జున పక్కన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో రష్మిక డిగ్లామరస్ రోల్ లో నటించద గమనార్హ. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను పుష్ప: ది రైజ్..అనే పేరుతో క్రిస్ మస్ పండుగ కానుకగా చిత్ర బృందం డిసెంబరు 17 న రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యింది. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసిన చిత్ర బృందం..సినిమా కు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గనంగా ప్లాన్ చేసింది. అంతేకాదు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వస్తుండడం ఈ సినిమాకి భారి హైప్ తీసుకొస్తుంది.

మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ వస్తున్నాడు అనే ప్రచారంతోనే పుష్ప సినిమాకు కావాల్సినంత ప్రమోషన్ దక్కింది. కాగా రీసెంట్ గా బన్నీ బాలయ్య అఖండ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభాస్ పుష్ప ప్రీ రిలీజ్ కు వస్తుండడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

కాగా.. అసలు ప్రభాస్ ని ఇలా గెస్ట్ గ్ ఆ పుష్ప సినిమాకు రప్పించే ఐడియా అల్లు అరవింద్ ఇచ్చారట.డిసెంబర్ 12న జరిగే పుష్ప ప్రీరిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ వస్తే పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఆ రేంజ్ లోనే పబ్లిసిటీ దొరుకుతుందని..అల్లు అరవింద్ ఇలా ప్లాన్ చేసారట. ఇక ముందు నుండే ప్రభాస్ బన్నీ మంచి ఫ్రెండ్స్ ..ఇక ఫ్రెండ్ పిలిస్తే రాకుండా ఉంటారా..చెప్పండి. అంతేకాదు త్వరలోనే బాలయ్య హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ అనే షోకి కూడా ప్రభాస్ గెస్ట్ గా రాబోతున్నారట. ఇలా ప్రభాస్ ని, బాలయ్యను బాగా వాడుకుంటున్నారు అల్లు ఫ్యామిలీ అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news