దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందించిన R R R సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7న థియేటర్లలోకి వస్తోంది. టాలీవుడ్‌లోనే ఇద్దరు క్రేజీ యంగ్‌స్టర్స్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలిసి నటిస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రు. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ అవుతోన్న ఈ సినిమా ప్రమోషన్లు ఇప్పటికే స్పీడప్ అయ్యాయి. ఇటీవల రిలీజ్ అయిన అన్ని టీజర్లు దుమ్ము రేపుతున్నాయి. తాజాగా రిలీజ్ అయిన నాటు నాటు హుక్ స్టెప్ కూడా ఇంటర్నెట్‌ను షేక్ చేసి పడేసింది. ఈ పాట అన్ని భాషల్లో కలుపుకుంటే కోట్లలో వ్యూస్ రాబడుతోంది. ఈ రోజు జననీ అంటూ సాగే దేశభక్తి గీతాన్ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
సాంగ్ చాలా అర్థవంతంగా ఉంది. జననీ ప్రియభారత జననీ ..! పాట ఆద్యంతం ఉద్విగ్నం కలిగించే దృశ్యాలు మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాయి. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్ పాత్ర.. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ పాత్ర స్వరూపాలు ఎలా ఉండబోతున్నాయో ? ఈ వీడియోలో ఆవిష్కరించారు. ఇక అజయ్‌దేవగన్‌ను విప్లయ యోధుడిగా ఆవిష్కరించిన తీరు అద్భుతం. అజయ్ సరసన శ్రీయ నాయికగా కనిపిస్తోంది.
ఏదేమైనా రాజమౌళి ఈ పాటతో మరోసారి సినిమాపై అంచనాలను ఆకాశాంలోకి తీసుకు వెళ్లిపోయారు. ఇక ట్రైలర్ ఎప్పుడు వస్తుందా ? ఆ తర్వాత ఎప్పుడు జనవరి 7 వస్తుందా ? అని వెయిట్ చేయడం ఒక్కటే మిగిలి ఉంది.