Moviesప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన ఆ సినిమా అంటే ఎన్టీఆర్‌కు పిచ్చ ఇష్ట‌మ‌ట‌..!

ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన ఆ సినిమా అంటే ఎన్టీఆర్‌కు పిచ్చ ఇష్ట‌మ‌ట‌..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ‌రుస హిట్లతో కెరీర్లో దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఐదు వరుస హిట్ సినిమాలు ఎన్టీఆర్ ఖాతాలో పడ్డాయి. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్‌ సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్ ఇటు బుల్లితెర మీద ఎవరు మీలో కోటీశ్వరులు షోతో కూడా ప్రేక్షకులకు మరింత చేరువ అవుతున్నారు. పలువురు కంటెస్టెంట్ల‌తో తన వ్యక్తిగత విషయాల నుంచి తన సినిమా కెరీర్ లో అనేక విషయాలను కూడా పంచుకుంటున్నారు.

గతంలో బిగ్ బాస్ హోస్ట్ గా బుల్లితెర దుమ్మురేపిన ఎన్టీఆర్… ఇప్పుడు ఈ షో తో బుల్లితెర ప్రేక్షకులకు కూడా మరింతగా దగ్గరవుతున్నారు. ఈ షోలో క్రియేటివిటీ లోపం కనిపిస్తున్నా ఎన్టీఆర్ మాత్రం తన పాత్రకు పూర్తిగా న్యాయం చేస్తున్నాడ‌నే చెప్పాలి. తన వ్య‌క్తిగ‌త‌, సినిమాల జ్ఞాపకాలను కూడా కంటెస్టెంట్ల‌తో షేర్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఓ కంటెస్టెంట్‌తో మాట్లాడుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చింది.

పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ సినిమా అంటే తనకు చాలా ఇష్టమని ఎన్టీఆర్ చెప్పారు. ఇద్దరూ ఇండస్ట్రీలో టాప్ హీరోలే. త‌న‌కు పోటీగా ఉన్న‌ టాప్ హీరో సినిమా గురించి ఎన్టీఆర్ ప్రశంసించడం గొప్ప విషయం. ఇక త్వరలోనే ఎన్టీఆర్ – మహేష్ ఎపిసోడ్‌లో కూడా పవన్ కళ్యాణ్ వీడియో కాల్ ద్వారా అందుబాటులోకి వస్తాడన్న ప్రచారం కూడా జరుగుతోంది.

ఇప్పుడు అందరూ ఈ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలోనే ఎన్టీఆర్ తనకు పవన్ నటించిన తొలిప్రేమ సినిమా అంటే చాలా ఇష్టం అంటూ చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ అభిమానుల మ‌న‌సుల‌ను గెలుచుకున్నాయి.1998 లో వచ్చిన తొలిప్రేమ సినిమా జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు గెలుచుకుంది. కరుణాకరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి రెడ్డి హీరోయిన్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news