Moviesజ‌గ‌దేక‌వీరుడు అతిలోక‌సుంద‌రికి చిరు రెమ్యున‌రేష‌న్ ఓ రికార్డే..!

జ‌గ‌దేక‌వీరుడు అతిలోక‌సుంద‌రికి చిరు రెమ్యున‌రేష‌న్ ఓ రికార్డే..!

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో ఏకంగా 35 సంవత్సరాలకు పైగా తిరుగులేని స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. మధ్యలో 10 ఏళ్లు సినిమాలకు దూరం అయినా కూడా ఖైదీ నెంబర్ 150 సినిమాతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. చిరు రీ ఎంట్రీ సినిమా అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి లాంటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న పాత్రలు కూడా తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ఇంత వయసులోనూ భారీ బడ్జెట్ సినిమాలో న‌టించ‌గ‌ల స‌త్తా త‌న‌కే ఉంద‌ని చిరంజీవి ఫ్రూవ్ చేసుకున్నారు.

ఇక చిరు నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి ఓ మైల్‌స్టోన్ సినిమాగా నిలిచింది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై చలసాని అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమాకు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. అప్పటికే బాలీవుడ్ లో తిరుగులేని హీరోయిన్‌గా ఉన్నా శ్రీదేవిని భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరి ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు.

ఈ సినిమాకు రాఘవేంద్రరావుతో పాటు జంధ్యాల‌ స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికీ 31 సంవత్సరాలు పూర్తవుతున్నా ఈ సినిమా ఇప్ప‌ట‌కీ చాలా కొత్తగా ఉన్నట్టే ఉంటుంది. బుల్లితెరపై ఇప్పటికి ఈ సినిమాను చూసేందుకు ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా రిలీజ్ అయిన టైంలో భారీ వర్షాలు కురవడంతో వారం రోజులపాటు థియేటర్లకు ఎవ్వరూ రాలేదట.

వారం రోజుల నుంచి క్రమక్రమంగా జనాలు రావడంతో కలెక్షన్లు పెరిగాయి. నెల రోజులు గడిచేసరికి టిక్కెట్లు దొరకటం గ‌గ‌నం అయిపోయింది. అలా 100 రోజులు – 200 రోజులు… సంవత్సరం పాటు ఈ సినిమా థియేట‌ర్ల‌లో ఆడింది. ఈ సినిమాలో న‌టించినందుకు చిరంజీవికి రు. 35 ల‌క్ష‌లు రెమ్యున‌రేష‌న్ ఇచ్చార‌ట‌. అప్ప‌ట్లో అది చాలా ఎక్కువ‌. ఇక శ్రీదేవికి కూడా రు. 25 ల‌క్ష‌లు ఇచ్చారు. మూడున్న‌ర ద‌శాబ్దాల క్రింద‌ట ఈ రెమ్యున‌రేష‌న్ ఇప్ప‌టి లెక్క‌ల్లో చూస్తే కోట్ల‌లోనే ఉంటుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news