ఏపీలో అధికార పార్టీలో ఉన్న ఇద్దరు వైసీపీ కీలక నేతలు ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితులు అన్న విషయం తెలిసిందే. మంత్రి కొడాలి నానితో పాటు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ( టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి దగ్గరయ్యారు) ఇద్దరూ కూడా ఎన్టీఆర్‌కు జాన్ జిగినీలే. గతంలో కొడాలి నాని నిర్మాతగా వినాయక్ దర్శకత్వంలో సాంబ సినిమా వచ్చింది. 2004లో కొడాలి నాని ఎమ్మెల్యే అయ్యాక ఈ సినిమా వచ్చింది. ఆ తర్వాత 2009 ఎన్నికల తర్వాత మరోసారి కొడాలి నాని, వల్లభనేని వంశీ కలిసి ఎన్టీఆర్ హీరోగా అదుర్స్ సినిమా నిర్మించారు. ఈ సినిమాకు కూడా వినాయక్ దర్శకుడు.
ఈ సినిమా వచ్చాక రాజకీయంగా కొడాలి నాని దారి వేరు అయ్యింది. ఆయన వైసీపీలోకి వెళ్లారు. ఇక గత ఎన్నికల్లో వంశీ టీడీపీ నుంచి గెలిచాక వైసీపీ చెంత చేరారు. అదలా ఉంటే ఇప్పుడు మరోసారి నాని, వంశీ ఇద్దరు కలిసి జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా నిర్మిస్తారన్న ప్రచారం ఉంది. వాస్తవానికి ఈ ప్రచారం ఇండస్ట్రీ వర్గాల్లో ఎప్పటి నుంచో ఉంది. ఈ సినిమాకు కూడా వినాయకే దర్శకుడు అంటున్నారు.
ఎన్టీఆర్ ఇప్పుడు చాలా కమిట్మెంట్స్తో ఉన్నాడు. ఆర్ ఆర్ తర్వాత కొరటాల శివ సినిమా ఉంది. అది అయ్యాక కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కు కమిట్ అయ్యాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా చేయాల్సి ఉంది. ఇవి ఎప్పటకి పూర్తవుతాయో ? తెలియదు. ఈ సినిమా తర్వాత కొడాలి నాని, వల్లభనేని వంశీ నిర్మాతలుగా ఎన్టీఆర్ సినిమా ఉంటుందని తెలుస్తోంది.
ఎన్టీఆర్ గతంలోనే వీరిద్దరికి తాను ఓ సినిమా చేస్తానని హామీ ఇచ్చాడు. అయితే అదుర్స్ తర్వాత ఎవరి బిజీలో వారు ఉండడంతో ఈ సినిమా సాధ్యం కాలేదు. ఎన్టీఆర్ పై ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయ్యాక ఈ కాంబినేషన్లో ఎప్పుడు అయినా సినిమా ఉండే ఛాన్సులు ఉన్నాయి. ఈ సినిమాకు కూడా వినాయక్ దర్శకత్వం వహిస్తాడని అంటున్నా చివర్లో డైరెక్టర్ మారినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు.