Moviesచైతు స‌మంత కంటే ముందే ఆ స్టార్ హీరోయిన్‌తో ప్రేమాయ‌ణం న‌డిపాడా...!

చైతు స‌మంత కంటే ముందే ఆ స్టార్ హీరోయిన్‌తో ప్రేమాయ‌ణం న‌డిపాడా…!

అక్కినేని నాగచైతన్య ఇటీవ‌లే పెద్ద కుదుపు నుంచి కోలుకుని మ‌ళ్లీ త‌న జ‌ర్నీని స్పీడ‌ప్ చేస్తున్నాడు. తాను ఎంతో ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్ స‌మంతతో విడాకుల వ్య‌వ‌హారంతో కాస్త ఇబ్బంది ప‌డ్డ చైతు ఇప్పుడు వ‌రుస‌గా సినిమాలు చేసుకుంటూ కెరీర్‌పై కాన్‌సంట్రేష‌న్ చేస్తున్నాడు. ఇటీవ‌లే శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ల‌వ్‌స్టోరీ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌రోవైపు బాలీవుడ్లో స్టార్ హీరో అమీర్ ఖాన్‌తో ఓ సినిమా చేస్తున్నాడు.

ఇక చైతు – స‌మంత ఎందుకు ? విడిపోయారు ? అనే దానిపై ర‌క‌ర‌కాల గుస‌గుస‌లు వినిపించాయి. స‌మంత‌కు ప్రీత‌మ్ జుకాల్క‌ర్‌తో అనుబంధం అని ఒక‌రు అంటే .. కాదు కాదు చైతుకు మ‌రో హీరోయిన్‌తో ఎఫైర్ ఉంద‌ని.. ఆమె వ‌ల్లే వీరి మ‌ధ్య గ్యాప్ వ‌చ్చింద‌ని మ‌రో ప్ర‌చారం జ‌రిగింది. ఏ ప్ర‌చారం ఎలా ? ఉన్నా కూడా చైతు స‌మంత‌తో ప్రేమ‌లో ప‌డ‌డానికి ముందే మ‌రో స్టార్ హీరోయిన్‌తో ప్రేమ‌లో ప‌డిన‌ట్టు అప్ప‌ట్లో గుస‌గుస‌లు వినిపించాయి. అయితే ఈ విష‌యం చాలా త‌క్కువ మందికి మాత్ర‌మే తెలుసు అని అంటారు.

ఆమె ఎవ‌రో కాదు లోక నాయ‌కుడు క‌మ‌ల్‌హాస‌న్ కుమార్తె శృతీహాస‌న్‌. 2010 నుంచే చైతు – శృతి మ‌ధ్య ప‌రిచ‌యం ఉంద‌ట‌. అప్ప‌టి నుంచి వారి మ‌ధ్య ఉన్న స్నేహం కాస్తా ప్రేమ‌గా మారింద‌ని అప్ప‌ట్లో టాక్ వినిపించింది. క‌రెక్టుగా అదే టైంలో సిద్ధార్థ్ – స‌మంత ఎంతో స్నేహంగా ఉండేవారు. వారు ఎక్క‌డ చూసినా క‌లిసే ఉండేవారు.. ఓ సారి దేవాల‌యంలో క‌లిసి పూజ‌లు కూడా చేశారు. త‌ర్వాత ఏమైందో గాని సామ్‌, సిద్ధ‌కు దూర‌మ‌య్యాకే చైతుకు ద‌గ్గ‌రైంది.

అంత‌కు ముందే శృతీహాస‌న్‌తో ప్రేమ‌లో ఉన్న చైతు ఆమెను పెళ్లాడాల‌ని కూడా అనుకున్న‌ట్టు ప్ర‌చారం జరిగింది. అయితే ఎంతో అన్యోన్యంగా ఉండే వీరి మ‌ధ్య కూడా ఏవో చిన్న చిన్న కార‌ణాల‌తోనే మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో విడిపోయార‌ని అంటారు. ఆ త‌ర్వాత చైతు – సామ్ బంధం బ‌ల‌ప‌డి పెళ్లి వ‌ర‌కు వెళ్లింది.

Latest news