Moviesచిన్న‌ప్పుడే స్టార్ హీరోయిన్‌కు ప్ర‌పోజ్ చేసిన హీరో ఎవ‌రో తెలుసా..!

చిన్న‌ప్పుడే స్టార్ హీరోయిన్‌కు ప్ర‌పోజ్ చేసిన హీరో ఎవ‌రో తెలుసా..!

ఎస్ ఇది నిజంగా నిజ‌మే..! ఓ స్టార్ హీరోయిన్‌కు త‌న చిన్న వ‌య‌స్సులోనే ఓ హీరో ప్ర‌పోజ్ చేశాడ‌ట‌. ఆ బుడ్డోడు త‌న‌ను ప్ర‌పోజ్ చేయ‌డంతో ఆ స్టార్ హీరోయిన్ సైతం అప్ప‌ట్లో అవాక్కైపోయింద‌ట‌. అయితే అదే బుడ్డోడు కాల‌క్ర‌మంలో హీరో అయ్యాడు. మ‌రి ఆ స్టార్ హీరోయిన్ ఎవ‌రు ? నాటి బుడ్డోడు ? నేటి హీరో ఎవ‌రో చూద్దాం. ఆ స్టార్ హీరోయిన్ జుహీ చావ్లా .. ఆ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్‌.

ఐ హేట్ ల‌వ్ స్టోరీస్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా ఇమ్రాన్ స్వ‌యంగా ఈ విష‌యం చెప్పి అంద‌రిని ఆశ్చ‌ర్య ప‌రిచాడు. అమీర్ ఖాన్ – జూహీచావ్లా కాంబోలో ఖయామత్ సే ఖాయమత్ తక్ సినిమా వచ్చింది. 1988లో వ‌చ్చిన ఈ సినిమా అప్ప‌ట్లో దేశ‌వ్యాప్తంగా ఉన్న యువ‌త‌ను ఓ ఊపు ఊపేసింది. ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతున్న టైంలోనే ఇమ్రాన్ ఆమెను చూశాడ‌ట‌. అప్ప‌ట్లో జూహీ అంటే దేశ‌వ్యాప్తంగా ఉన్న యువ‌త‌కు ఓ ఆరాధ్య దేవ‌త‌.

ఆమెను షూటింగ్ స్పాట్లో చూసిన ఇమ్రాన్ ఖాన్ నేరుగా ఆమె అందానికి ఫిదా అయిపోయాడ‌ట‌. ఆమె ద‌గ్గ‌ర‌కు వెళ్లి మిమ్మ‌ల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పేశాడ‌ట‌. ఆ విష‌యం త‌లుసుకుని తాను ఇప్ప‌ట‌కి ఆశ్చ‌ర్య పోతూ ఉంటాన‌ని ఇమ్రాన్ చెప్పాడు. గ‌తంలో ఇదే విష‌యంపై జూహీ చావ్లా కూడా స్పందించింది. ఇమ్రాన్ ఆరేళ్ల వ‌య‌స్సు నుంచే త‌న‌కు తెలుసు అని.. ఖయామత్ సే ఖయామత్ తక్ షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు అక్క‌డ‌కు వ‌చ్చేవాడ‌ని చెప్పింది.

అమీర్‌ను మామా అని పిలిచేవాడ‌ని.. చాలా క్యూట్‌గా ఉండేవాడ‌ని.. ఓ రోజు హ‌ఠాత్తుగా త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి న‌న్ను పెళ్లి చేసుకుంటాన‌ని ప్ర‌పోజ్ చేయ‌డంతో త‌న‌కు ఏం చేయాలో తెలియ‌లేద‌ని చెప్పింది. వెంట‌నే నేను నీకు ఆంటీజీనే అని చెప్పి పంపించానని జూహీ చెప్పింది. ఈ సంఘ‌ట‌న గుర్తు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా తాను న‌వ్వుకుంటాన‌ని కూడా ఆమె తెలిపింది.

Latest news