స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ టాలీవుడ్‌లోని యంగ్ హీరోలలో స్టార్ హీరోగా దూసుకుపోతున్నారు. అల వైకుంఠ పురంలో లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బన్నీ క్రేజ్ ఒక్కసారిగా డబుల్ అయిపోయింది. తెలుగులో నాన్ బాహుబలి రికార్డులు అన్నింటికీ అల వైకుంఠపురం పాతరేసేసింది. బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్.
ఇక బన్నీ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే స్నేహరెడ్డి ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. టిఆర్ఎస్ పార్టీ కీలక నేత ప్రభాకర్ రెడ్డి కుమార్తె స్నేహ రెడ్డి. బన్నీతో ప్రేమలో పడినప్పుడు ఆమె తమ సొంత కాలేజ్‌లకు చైర్మన్‌గా వ్యవహరించారు. బన్నీ స్నేహరెడ్డిని ప్రేమించడానికి ముందు మరో అమ్మాయిని ఇష్టంగా ప్రేమించాడట.
బన్నీ అంటేనే ఎంతో మంది అమ్మాయిల కలల రాకుమారుడు. బన్నీ స్నేహారెడ్డి ని పెళ్లి చేసుకున్నప్పుడు వారందరి హృదయాలు బద్దలై ఉంటాయి. అలాగే బన్నీ తాను ఎంతో ఇష్టంగా ప్రేమించిన ఆ హీరోయిన్ కి పెళ్ళి అయినప్పుడు కూడా తన హృదయం బద్దలైందని ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పాడు.
ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్. 2007లో ఐశ్వర్య, అభిషేక్‌ను పెళ్లి చేసుకున్నప్పుడు తాను చాలా బాధపడ్డాను అని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.