Moviesఎన్టీఆర్ ఫ్యామిలీతో స‌హా చెక్కేశాడుగా.. ఏ దేశానికో తెలుసా..!

ఎన్టీఆర్ ఫ్యామిలీతో స‌హా చెక్కేశాడుగా.. ఏ దేశానికో తెలుసా..!

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ షూటింగులతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్‌ను ఫినిష్ చేశాడు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ దాదాపుగా మూడేళ్ల టైం కేటాయించాడు. 2018లో వ‌చ్చిన అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ న‌టించిన ఏ సినిమా రాలేదు. అప్ప‌టి నుంచి మ‌నోడు ఆర్ ఆర్ ఆర్ మీదే ప‌ని చేస్తున్నారు.

ఇక ఇప్పుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించే సినిమా షూటింగ్‌లో బిజీ కానున్నాడు. ఓ వైపు వ‌రుస‌గా సినిమా షూటింగ్‌లు, మ‌రోవైపు బుల్లితెరపై ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు గేమ్ షో షూటింగ్‌ల‌తో బిజీగా ఉన్న ఎన్టీఆర్ కాస్త రిలాక్స్ కానున్నాడు. ఈ క్ర‌మంలోనే త‌న ఫ్యామిలీతో కలిసి విదేశీ టూర్‌కు చెక్కేశాడు. ఈ రోజు ఉద‌యం త‌న భార్య‌, పిల్ల‌ల‌తో క‌లిసి ఎన్టీఆర్ స్విట్జ‌ర్లాండ్‌కు వెళ్లారు.

ఈ ఫొటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. అక్క‌డ కొద్ది రోజుల పాటు రిలాక్స్ అయ్యాక తిరిగి ఇండియాకు వ‌స్తాడు. ఆ త‌ర్వాత ఆర్ ఆర్ ఆర్ ప్ర‌మోష‌న్స్‌లో బిజీ కానున్నాడు. సంక్రాంతి వ‌ర‌కు నెల‌న్న‌ర పాటు ఈ ప్ర‌మోష‌న్ల‌లోనే ఉంటాడ‌ట‌. ముఖ్యంగా ఈ సినిమాకు నార్త్‌లో భారీ ఎత్తున ప్ర‌మోష‌న్లు ప్లాన్ చేస్తున్నారు. వీటిలో ఎన్టీఆర్ పాల్గొంటాడు.

ఆ త‌ర్వాత కొర‌టాల శివ సినిమా షూటింగ్‌లో జాయిన్ అవుతారు. ఇక ఎన్టీఆర్‌కు ఇదే ఖ‌చ్చిత‌మైన బ్రేక్ టైం. మ‌ళ్లీ వ‌రుస ప్ర‌మోష‌న్లు, సినిమా షూటింగ్‌ల‌తో క్ష‌ణం తీరిక లేకుండా మ‌రో ఆరేడు నెల‌లు గ‌డ‌పాల్సి ఉంటుంది. అందుకే ఈ రిలాక్స్ టైంను ఎంచ‌క్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news