Moviesద‌ర్శ‌కుల‌నే ప్రేమించి పెళ్లాడిన స్టార్ హీరోయిన్లు వీళ్లే...!

ద‌ర్శ‌కుల‌నే ప్రేమించి పెళ్లాడిన స్టార్ హీరోయిన్లు వీళ్లే…!

సినిమా ఇండ‌స్ట్రీలో హీరోయిన్ల‌కు లైఫ్ టైం త‌క్కువ‌. హీరోల్లా వాళ్లు ఏళ్ల‌కు ఏళ్లు ఇక్క‌డ పాతుకు పోవ‌డం క‌ష్టం. 30 ప‌దుల వ‌య‌స్సు దాటి.. శ‌రీరం కాస్త ముడ‌త‌లు ప‌డిందంటే అవ‌కాశాలు ద‌క్కించుకునేందుకు చాలా క‌ష్టాలు ప‌డాలి. అలాంటి అదృష్టం ఏ న‌య‌న‌తారో, అనుష్క‌, ర‌మ్య‌కృష్ణ లాంటి ఒక‌రిద్ద‌రికి మాత్ర‌మే ఉంటుంది. ఇక హీరోయిన్లు – డైరెక్ట‌ర్ల బంధం కూడా ఎక్కువే. ఒక్కో ద‌ర్శ‌కుడు, హీరోయిన్ కాంబినేష‌న్ ప‌దే ప‌దే రిపీట్ అయ్యి హిట్లు కొట్టిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. ఇక కొంద‌రు ద‌ర్శ‌కులు, హీరోయిన్లు ప్రేమ‌లో ప‌డి పెళ్లి చేసుకున్నారు కూడా. అలాంటి వారి లిస్ట్ ఇప్పుడు చూద్దాం.

రమ్యకృష్ణ:
ద‌శాబ్దాలుగా ఇండ‌స్ట్రీలో పాతుకుపోయిన సీనియ‌ర్ హీరోయిన్ రమ్యకృష్ణ. ఆమె నాగార్జున హీరోగా కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో చంద్ర‌లేఖ సినిమా చేశారు. ఈ సినిమా షూటింగ్ టైంలో ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారి.. వీరు పెళ్లి చేసుకున్నారు. మ‌ధ్య‌లో వీరు విడిపోతున్నారంటూ ఎన్నో గాసిప్పులు వ‌చ్చాయి. అయినా వీరి బంధం చెక్కుచెద‌ర్లేదు. 2003లో వీరి పెళ్లి జ‌రిగింది.

సుహాసిని:
సున్నిత‌మైన క‌థ‌ల‌తో సినిమాల‌ను తెర‌కెక్కించే సౌత్ ఇండియా స్టార్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం. ఇక సుహాసిని ఎంత గొప్ప న‌టో చెప్ప‌క్క‌ర్లేదు. మ‌ణిర‌త్నం – సుహాసిని పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి పెళ్లి పెద్ద‌లు నిర్ణ‌యించారు. 1988లో వీరి పెళ్లి జ‌రిగింది. ఈ దంప‌తుల‌కు ఓ కుమారుడు కూడా ఉన్నాడు.

రోజా:
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ రోజా మంచి ఫాంలో ఉన్నప్పుడే తాను ప్రేమించిన త‌మిళ ద‌ర్శ‌కుడు ఆర్కే. సెల్వ‌మ‌ణిని ప్రేమ వివాహం చేసుకున్నారు. 2002లో వీరికి పెళ్ల‌య్యింది. ఈ దంప‌తుల‌కు ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. రోజా ప్ర‌స్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా వ‌రుస‌గా రెండోసారి గెలిచారు.

అమలాపాల్:
బ్లాక్ బ్యూటీ అమలాపాల్ దర్శకుడు ఏఎల్ విజయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. విజ‌య్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ప‌లు సినిమాల్లో ఆమె న‌టించింది. అయితే పెళ్ల‌య్యాక కూడా అమ‌ల న‌టించ‌డం విజ‌య్‌కు ఇష్టంలేదు. ఈ స్ప‌ర్థ‌ల‌తోనే వీరు విడాకులు తీసుకున్నారు. ఆ త‌ర్వాత విజ‌య్ మ‌రో పెళ్లి కూడా చేసేసుకున్నారు.

సోనియా అగర్వాల్:
7/G బృందావని కాలనీ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన సోనియా అగర్వాల్ ఆ త‌ర్వాత స్టార్ హీరోయిన్ అయ్యింది. ఆ సినిమా డైరెక్ట‌ర్ సెల్వ రాఘ‌వ‌న్‌ను 2006లో ప్రేమ వివాహం చేసుకుంది. అయితే మ‌న‌స్ప‌ర్థ‌ల‌తో వీరు విడిపోయారు.

లిజీ:
సీనియ‌ర్ హీరోయిన్ లిజీ, ప్ర‌ముఖ మ‌ళ‌యాళ ద‌ర్శ‌కుడు ప్రియ‌ద‌ర్శ‌న్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఇర‌వై ఏళ్ల కాపురం త‌ర్వాత వీరు విడిపోయారు. వీరి కుమార్తే క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news