తెలుగు తెరపై ఇటీవల కాలంలో తెలుగు హీరోయిన్లు రావడం అరుదు అయిపోయింది. స్వాతి, అంజలి లాంటి వాళ్లు వచ్చినా మరీ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు అయితే ఎదగలేదు. ఉన్నంతలో అంజలి మాత్రం పర్వాలేదు. తెలుగులో స్టార్ హీరోల పక్కన నటించడంతో పాటు అటు కోలీవుడ్‌లోనూ సత్తా చాటింది. ఇక ఆనంది కూడా ఉన్నంతలో కొన్ని మంచి సినిమాల్లో నటించారు. ఇక ఈషా రెబ్బా కూడా అచ్చ తెలుగు అమ్మాయే. అయితే వీరు మరీ హాట్ హాట్‌గా వెళ్లేందుకు మాత్రం ఇష్టపడలేదు.
ఇక ఈ క్రమంలోనే మరో అచ్చ తెలుగు అందం కూడా ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతోంది. ఆమె ఎవరో కాదు శోభిత ధూళిపాళ. ఆమెది ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలి. ఆమె తెలుగు అమ్మాయి అయినా కూడా నటిగా మాత్రం ఆమె కెరీర్ బాలీవుడ్‌తో స్టార్ట్ అయ్యింది. తొలి సినిమా రామన్ రాఘవ్ 2.0తో హీరోయిన్ అయిన అక్కడ సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత తెలుగుతో పాటు మళయాళంలోనూ కొన్ని సినిమాలు చేసింది.
తెలుగులో అడవి శేష్ హీరోగా ఆమె చేసిన గూఢచారి సినిమా అయితే ఆమె కెరీర్‌కు ఒక్కసారిగా మంచి ఊపు ఇచ్చింది. ఈ క్రమంలోనే అడవి శేష్ లేటెస్ట్ సినిమా మేజర్‌లో కూడా ఆమె నటించింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే యేడాదిలో రిలీజ్ అవుతోంది.
ఇక శోభితకు మళయాళంలోనూ మంచి క్రేజ్ ఉంది. ఆమె చేసిన కురుప్ సూపర్ హిట్ అయ్యింది. అయితే తెలుగులో టైటిల్ మైనస్ కావడంతో ఇక్కడ ఎవ్వరూ కురుప్‌ను పట్టించుకోలేదు. దుల్కర్ సల్మాన్ లాంటి స్టార్ హీరో పక్కన నటించడంతో ఇప్పుడు అక్కడ కూడా ఆమెకు పిచ్చ పాపులారిటీ పెరిగింది. ఇక తమిళ్లో కూడా ఆమె మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ సినిమాతో పలకరించనుంది. ఏదేమైనా తెలుగులో చాలా రోజుల తర్వాత ఓ అమ్మాయికి హీరోయిన్గా సౌత్‌లో మంచి క్రేజ్ వస్తోంది.