Moviesఈ ఫొటోలో క‌నిపిస్తోన్న పాప‌.. ఓ స్టార్ హీరోయిన్‌.. స్టార్ హీరో...

ఈ ఫొటోలో క‌నిపిస్తోన్న పాప‌.. ఓ స్టార్ హీరోయిన్‌.. స్టార్ హీరో భార్య‌.. మీకు తెలుసా..!

చాలామంది సెలబ్రిటీలు, పెద్ద స్థాయిలో ఉన్న‌వారు.. తమ తమ రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నప్పుడు వారి చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలాగే ఆ చిన్నప్పుడు ఫోటో ఇప్పుడు ఫోటో పక్కన పెడితే అసలు వారిని ఏమాత్రం గుర్తుపట్టలేము. ఈ క్రమంలోనే ప్రస్తుతం సౌతిండియాలో ఓ స్టార్ హీరోయిన్ చిన్నప్పుడు ఫోటో కూడా వైరల్ అవుతుంది. పై ఫోటోలో చాలా ముద్దుగా… బొద్దుగా కనిపిస్తున్న ఆ పాప ఇప్పుడు ఓ హీరోయిన్… అలాగే మరో స్టార్ హీరో భార్య.

ఆమె ఎవరో కాదు నేచురల్ స్టార్ నాని పక్కన సుందరానికి సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న మలయాళీ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్. మలయాళంలో క్రేజీ హిట్లతో దూసుకుపోతున్న ఆమె ప్రముఖ మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తెలుగులో భార్యా భర్తలిద్దరూ రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఫాహ‌ద్ పుష్ప సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు. అలాగే సుందరానికి సినిమాతో ఎంట్రీ ఇస్తోంది. తెలుగులో ఇప్పటికే వీరిద్దరికీ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

వీరిద్ద‌రికి ఉన్న క్రేజ్ నేప‌థ్యంలో వీరు క‌లిసి ఓ సినిమాలో న‌టిస్తే చూడాల‌ని తెలుగు ప్రేక్ష‌కులు కూడా ఎంతో ఆశ‌తో ఎదురు చూస్తున్నారు. గ‌తంలో వీరిద్ద‌రు క‌లిసి త‌మ కాంబోలో ఓ సినిమా వ‌స్తుంద‌ని చెప్పి అభిమానుల్లో ఆశ‌లు క‌లిగించారు. ఇక ఫాహ‌ద్ న‌టిస్తోన్న పుష్ప సినిమా ఇప్ప‌టికే షూటింగ్ కంప్లీట్ అయ్యింది. డిసెంబ‌ర్ 17న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news