విజయ్ దెవరకొండ టాక్సీవాలా సినిమాతో దర్శకుడిగా రాహుల్ సంకృత్యన్ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ ని కూడా నటన పరంగా బాగా వాడుకున్నాడు. దీంతో రాహుల్ టేకింగ్ కు ప్రేక్షకుల తో పాటు సినిమా ఇండస్ట్రీ పెద్ద వాళ్లు కూడా ఫిదా అయిపోయారు. ఇక ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న రాహుల్ ఇప్పుడు నాని హీరో గా సెకండ్ ప్రాజెక్టుగా శ్యామ్ సింగ రాయ్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాలో నాచురల్ స్టార్ నాని హీరోగా చేస్తుంటే.. నాని పక్కన సాయి పల్లవి, కృతి శెట్టితో పాటు మళయాళ నటి మడోన్నా సెబాస్టియన్ కూడా నటిస్తోంది. ఈ ముగ్గురు ముద్దుగుమ్మల పక్కన నాని ఆడి పాడుతుంటే మామూలు రచ్చ కాదనే చెప్పాలి. ఈ సినిమాను డిసెంబర్ 24న విడుదల చేయాలి అని మేకర్స్ అనుకుంటున్నారు. ఇక్కడ షాకింగ్ మ్యాటర్ ఏమిటంటే.. మెగా ప్రీన్ వరుణ్ తేజ్ ఎంతొ ప్రతిష్టాతంకంగా నటించిన గని సినిమాను కూడా డిసెంబర్ 24న విడుదల చేయాలని చిత్ర బృందం డిసైడ్ అయ్యారట. దీంతో బాక్స్ ఆఫిస్ వద్ద టఫ్ ఫైట్ ఉండబోతున్నట్లు తెలుస్తుంది.
రెండు బడా హీరో సినిమాలు ఒకేసారి రావడం..ఇప్పుడు పెద్ద తలనోప్పిగా మారింది. ఎందుకంటే మార్కెట్ పరంగా సమస్యలు తీసుకువచ్చే అవకాశలు కూడా ఉన్నాయి. అయితే ఇదే విష్యం భావించిన గని నిర్మాతలు విడుదల తేదీని మార్చాలని నానిపై ఒత్తిడి తెస్తున్నట్టు ఓ గాసిప్ నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతానికి ఈ రెండు అప్డేట్స్ పై స్పష్టత లేకున్నా..ఇపుడు ఇండస్ట్రీలో చాలా మంది ఈ రెండు సినిమాలు ముందుగా నిర్ణయించిన ప్రకారం ఒకేసారి విడుదలవుతాయా..? లేదంటే మేకర్స్ కాంప్రమైజ్ అయి వేరే తేదీలను ఫిక్స్ చేస్తారా..? అన్నది తెలియాల్సి ఉంది.