Moviesబాబాయ్‌, అబ్బాయ్‌పై నంద‌మూరి ఫ్యాన్స్ ఫ్యీజులు ఎగిరే న్యూస్‌..!

బాబాయ్‌, అబ్బాయ్‌పై నంద‌మూరి ఫ్యాన్స్ ఫ్యీజులు ఎగిరే న్యూస్‌..!

తెలుగు సినిమా రంగంలో నందమూరి ఫ్యామిలీ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. య‌వరత్న నందమూరి బాలకృష్ణ మూడున్నర దశాబ్దాలుగా సీనియ‌ర్ హీరోగా కొనసాగుతూ వస్తున్నారు. ఇక ఇదే ఫ్యామిలీ నుంచి మూడో తరం హీరోగా ఎంట్రీ ఇచ్చినా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సైతం వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. అయితే కొద్దిరోజులుగా బాబాయ్ – అబ్బాయి మధ్య గ్యాప్ ఎక్కువుగా ఉంద‌న్న‌ ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. వీరిద్దరూ ఇటీవల కాలంలో ఒకే వేదికపై కనిపించలేదు. అరవింద సమేత వీర రాఘవ సినిమా సక్సెస్ మీట్ , ఆ త‌ర్వాత ఎన్టీఆర్ బ‌యోపిక్ ఫంక్ష‌న్ల‌లో మాత్ర‌మే బాలయ్య – జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఒకే వేదికపై కనిపించారు.

ఆ తర్వాత వీరిద్దరూ కనిపించలేదు. అయితే నందమూరి అభిమానులు మాత్రం బాబాయ్ – అబ్బాయిని తిరిగి ఎప్పుడు ఒకే వేదికపై చూస్తామా ? అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ వస్తున్నారు. టాలీవుడ్ సర్కిల్స్ లో వినపడుతున్న తాజా సమాచారం ప్రకారం బాలయ్య నటించిన అఖండ‌ సినిమా ప్రి రిలీజ్ ఫంక్ష‌న్‌కు జూనియర్ ఎన్టీఆర్ హాజరు కానున్నారని తెలుస్తోంది. ఈ న్యూస్ ఇప్పుడు ఇండ‌స్ట్రీ స‌ర్కిల్స్‌లో వైరల్ అవుతుంది. ఇక్కడే మరో సమాచారం కూడా బయటకు వచ్చింది.

బాలయ్య హోస్ట్ చేస్తున్న‌ టాక్ షో అన్‌స్టాప‌బుల్‌. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ ఓ ఎపిసోడ్ లో గెస్ట్ గా రానున్నారట. అయితే అంతకు ముందే అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ వస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ సినిమా దర్శకుడు బోయపాటి శ్రీను కూడా ఎన్టీఆర్‌కు సన్నిహితులే. ఎన్టీఆర్ తో బోయపాటి దమ్ము సినిమాను తెరకెక్కించారు.

గతంలో బోయపాటి – బాలయ్య కాంబినేషన్లో వచ్చిన సింహ ఆడియో సక్సెస్ మీట్‌కు ఎన్టీఆర్ గెస్ట్ గా వచ్చారు. ఎన్టీఆర్ ఎన్నో సందర్భాల్లో బాబాయ్‌పై త‌న అనంతాభిమానాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే వీరిద్ద‌రు క‌లిసి క‌న‌ప‌డ‌డం మాత్రం అరుదు అయిపోతోంది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ – బాలయ్య ఒకే వేదికపై కనిపిస్తే నందమూరి అభిమానులకు అంతకు మించిన ఆనందం ఏముంటుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news