Moviesప్రమోషన్స్ కోసం ఈ హీరో ఏం చేస్తున్నాడో మీరే చూడండి..!!

ప్రమోషన్స్ కోసం ఈ హీరో ఏం చేస్తున్నాడో మీరే చూడండి..!!

ఈ రోజుల్లో ఒక్క సినిమా తీయ్యడం గొప్ప కాదు..ఆ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడం, సరిగ్గా ప్రమోట్ చేసుకోవడం గొప్ప విషయం. పెద్ద సినిమాల ప్రమోషన్స్ సంగతి చెప్పక్కర్లేదు.. డబ్బు ఉంటాది కాబట్టి వాళ్లు ఎలాగైన పబ్లిసిటీ చేసుకుంటారు. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లంస్ అన్ని చిన్న సినిమాలకే. కొన్ని చిన్న సినిమాలు వాళ్ల మూవీస్ కు సంబంధించిన ప్రమోషన్స్ ని స్టార్ హీరోలతో టైటిల్, టీజర్ లాంచ్ లాంటివి చేస్తుంటారు. చిన్న సినిమాల పై ప్రేక్షకుల దృష్టిని పడేలా చేసుకోవడం తప్పనిసరి అయింది. ఈ ప్రమోషన్స్ లో భాగంగ హూరో,హీరోయిన్స్ రోడ్డు పైకి వచ్చి తమ సినిమా పోస్టర్స్ వాళ్లే అంటించుకున్నారు.

పూర్తి వివరాళ్లోకి వెళ్ళితే.. “రామ్ అసుర్” హీరో అభినవ్ సర్దార్, హీరోయిన్ చాందిని మాత్రం త‌మ సినిమా చూడండి అంటూ జ‌నంలోకి వెళ్లి ప్ర‌చారం చేశారు. బస్టాండ్ లాంటి పబ్లిక్ ఏరియాల్లో తిరుగుతూ రామ్ అసుర్ మూవీ గురించి వివరించారు. వాల్ పోస్టర్స్ కూడా స్వయంగా ఆ ఇద్దరే అంటించి ప్రమోషన్స్‌లో డిఫరెంట్ స్ట్రాటజీ చూపించారు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఎలాంటి హంగు, ఆర్భాటాలకు పోకుండా స్వయంగా జనంలోకి వెళ్లి తమ సినిమా చూడండి అంటూ హీరో హీరోయిన్ స్వయంగా పోస్టర్స్ అంటించారు.

మంచి కంటెంట్ ఉన్న మూవీ అని .. బస్టాండ్ లాంటి పబ్లిక్ ఏరియాల్లో తిరుగుతూ రామ్ అసుర్ పోస్టర్స్ అంటిస్తూ మూవీ గురించి వివరించారు. వాల్ పోస్టర్స్ కూడా స్వయంగా ఆ ఇద్దరే అంటించి ప్రమోషన్స్‌లో డిఫరెంట్ స్ట్రాటజీ చూపించడంతో అభిమానులు బాగా అట్రాక్త్ అవుతున్నారు. వెంక‌టేష్ త్రిప‌ర్ణ దర్శకత్వంలో అభిన‌వ్ స‌ర్ధార్‌, వెంక‌టేష్ త్రిప‌ర్ణ సంయుక్తంగా కలసి నిర్మిస్తున్న”పీనట్ డైమండ్” చిత్రం మాస్ ఆడియన్స్‌కు రీచ్ కావాలని ఈ చిత్ర టైటిల్‌ను ” రామ్ అసుర్‌ ” గా మార్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news