పాకిస్తాన్‌కు చెందిన నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ ప్రపంచ వ్యాప్తంగానే చిన్న వయస్సులోనే ఎంతో పాపులర్ అయ్యారు. కేవలం 17 సంవత్సరాల వయస్సులో నోబెల్ బహుమతి గెలుచుకున్న అమ్మాయిగా ప్రపంచ రికార్డు క్రియేట్ చేసిన మలాలా బుధవారం దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టారు. ఆమే తన సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు. బ్రిటన్‌లోని బర్మింగ్‌హోం నగరంలో ఉంటోన్న ఆమె తన కుటుంబ సభ్యుల సమక్షంలోనే అస్సర్ మాలిక్‌తో తన నిఖా జరిగినట్టు చెప్పారు.
తామిద్దరం కొత్త వైవాహిక జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని.. తమకు మీ ఆశీస్సులు కావాలని ఆమె పేర్కొంది. మలాలా ఇప్పటికే వరల్డ్ వైడ్ పాపులర్. ఆమె పెళ్లి చేసుకోవడంతో నెటిజన్లు సహజంగానే ఆమె భర్త ఎవరు ? అని ఆరా తీస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆమె భర్త గురించి కొన్ని విషయాలు తెలిశాయి. ఆమె భర్త అస్సర్ మాలిక్ ఓ ఎంట్ర ప్రెన్యూర్.
ఇక అస్సర్ మాలిక్ కూడా పాకిస్తాన్‌కు చెందిన వారే. మాలిక్ లాహోర్‌లోని టుచిన్సన్ కాలేజ్‌లో చదివారు. ఆ తర్వాత లాహోర్ వర్సిటీ నుంచి మేనేజ్మెంట్ సెన్స్‌లో డిగ్రీ పట్టా సాధించారు. ఇక అస్సర్ కు క్రీడలతో కూడా మంచి అనుబంధమే ఉంది. 2020లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో చేరిన అస్సర్ పీసీబీ హై పర్ఫార్మెన్స్ జనరల్ మేనేజర్‌గా ఉన్నారు.
Today marks a precious day in my life.
Asser and I tied the knot to be partners for life. We celebrated a small nikkah ceremony at home in Birmingham with our families. Please send us your prayers. We are excited to walk together for the journey ahead.
📸: @malinfezehai pic.twitter.com/SNRgm3ufWP— Malala (@Malala) November 9, 2021