ఆయన టాలీవుడ్లో ఓ అగ్ర దర్శకుడు. ఆయన తో సినిమా అంటే ఎంత స్టార్ హీరో అయినా తన ఖాతాలో బ్లాక్‌బస్టర్ పడినట్టే అని లెక్కలు వేసుకుంటూ ఉంటారు. ఆయన తన డైలాగులతో ప్రేక్షకులకు పిచ్చెక్కించేయడమే కాదు… ఎప్పటికప్పుడు ప్రెష్ ఎఫైర్లతో కూడా ఇండస్ట్రీ ఇన్నర్ సర్కిల్స్‌లో పెద్ద హాట్ టాపిక్‌గా ఉంటారు. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు హీరోయిన్లతో ఎఫైర్లు పెట్టుకున్నాడన్నది ఇండస్ట్రీలో జగమెరిగిన సత్యం.
పదేళ్ల క్రిందటే ఓ హీరోయిన్‌తో ఎఫైర్ పెట్టుకుని ఆమెకు తన సినిమాల్లో రెండు సార్లు ఛాన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత ఫేడవుట్ అయిపోయిన ఓ హీరోయిన్‌కు వరుసగా రెండు సినిమాల్లో ఛాన్సులు ఇచ్చాడు. ఆమెతో ఎఫైర్ పెట్టుకున్నందుకే ఆమెకు వరుసగా రెండు ఛాన్సులు ఇచ్చాడని అంటారు. ఆ తర్వాత పేరు మోసిన మరో టాప్ హీరోయిన్‌కు ఏకంగా మూడు సినిమాల్లో ఛాన్సులు ఇచ్చాడు. ఆమెను ఇష్టమొచ్చినట్టు వాడుకున్నాడని అంటారు. ఆ టైంలోనే ఓ సారి హీరోయిన్తొ రొమాన్స్ చేస్తుండగానే తన భార్యకు అడ్డంగా దొరికిపోయాడన్న లీకులు కూడా వచ్చాయి.
ఇక ఇప్పుడు మనోడు మరో హీరోయిన్ను పట్టేశాడు. ఆమెకు కూడా తెలుగులో మాంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే ఆమెకు రెండు ఛాన్సులు ఇచ్చాడు. ఆమె కూడా సదరు స్టార్ డైరెక్టర్‌తో ఎంజాయ్ చేస్తూనే అటు ఆయన దర్శకత్వం వహించే స్టార్ హీరోల సినిమాల్లో కూడా ఛాన్సులు కొట్టేస్తోంది. ఆయన నెక్ట్స్ తీసే సినిమాలో కూడా ఆ నార్త్ భామకే ఎలా ఛాన్స్ ఇప్పించాలా ? అని ప్రయత్నాలు చేస్తున్నాడట.