Moviesవిడాకుల త‌ర్వాత నాగ‌చైత‌న్య సంచ‌ల‌న నిర్ణ‌యం..!

విడాకుల త‌ర్వాత నాగ‌చైత‌న్య సంచ‌ల‌న నిర్ణ‌యం..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ రొమాంటిక్‌ కపుల్ గా ఉన్ననాగ‌ చైతన్య – సమంత ఎప్పుడూ వార్త‌ల్లో టాప్‌లో ఉండేవారు. వారు ఏం చేసినా ఓ సంచ‌ల‌న‌మే అయ్యేది. వారి ప్రేమ‌, వారి టూర్లు, వారి పెళ్లి, వారి అన్యోన్య‌త ఇలా ప్ర‌తి ఒక్కటి వారు సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకోవ‌డంతో తెలుగు జ‌నాలు అంద‌రూ వారి గురించి తెలుసుకునేందుకు ఎంతో ఆస‌క్తి చూపేవారు. అలా ఎంద‌రో యూత్ క‌ఫుల్స్‌కు ఆద‌ర్శంగా ఉన్న ఈ జంట కాస్తా అంద‌రికి షాక్ ఇస్తూ విడిపోయారు.

నాలుగేళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లుకుతూ ఈ నెల 2న విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత ఎవరి పనులలో వారు బిజీగా ఉన్నారు. స‌మంత శాకుంత‌లం సినిమాతో పాటు వ‌రుస‌గా సినిమాలు చేస్తోంది. అటు చైతు కూడా ల‌వ్‌స్టోరీ స‌క్సెస్ ఎంజాయ్ చేస్తూ ప‌లు సినిమాల క‌థ‌లు వింటున్నాడు. విడాకుల త‌ర్వాత చైతు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు.

ఇప్ప‌టికే త‌న ఇంటిని బ‌య‌ట‌కు వ‌చ్చేసి గ‌చ్చిబౌలిలో ఉన్న ఓ ఫ్లాట్లోకి షిఫ్ట్ అయిపోయాడు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు సినిమాలు చేస్తూ వెండితెర‌పై మాత్ర‌మే క‌నిపిస్తోన్న చైతు ఇప్పుడు కొత్త‌గా వెబ్ సీరిస్‌లోకి కూడా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడ‌ట‌. క‌థాబ‌లం ఉన్న వెబ్‌సీరిస్‌ల్లో చేసేందుకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని టాక్‌. ఇక చైతు ప్ర‌స్తుతం థాంక్యూ, బంగార్రాజు సినిమాలు చేస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news