సినిమా వాళ్లు క్రికెటర్లతో ప్రేమలో పడడం ఎప్పటి నుంచో వస్తోంది. అంతెందుకు భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇక ఇదే తరహాలో గతంలో అజారుద్దీన్ – నౌరీన్‌తో మొదలు పెడితే ఈ తరం క్రికెటర్లు, హీరోయిన్ల వరకు చాలా మంది లవ్‌లు, డేటింగ్లు చేసుకున్న వారే. అయితే ఇవి 1980ల్లో కాదు.. 50 ఏళ్ల క్రితం కూడా ఉండేవి. ఓ భారత క్రేజీ హీరోయిన్ అప్పటి విండీస్ స్టార్ క్రికెటర్‌తో ప్రేమాయణం నడిపిందట. ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు.
1966లో జరిగిన ఈ ప్రేమకథ గురించి తెలుసుకుంటే ఆశ్చర్య పోవాల్సిందే. ఓ పార్టీలో విండీస్ స్టార్ క్రికెటర్ గ్యారీ సోబర్స్ నటి అంజు మహేంద్రను కలిశాడు. అయితే అప్పటికే ఆమె రాజేశ్ ఖన్నాతో ప్రేమలో ఉంది. రాజేష్ ముందు తనను ఎంకరేజ్ చేసినా.. తర్వాత తనకు అవకాశాలు రాకుండా చేశారన్న కోపంతో ఆయనకు దూరమైంది. ఈ టైంలో సోబర్స్‌తో స్నేహం ఏర్పడింది.
ఆ తర్వాత 1966లో విండీస్ జట్టు ఇండియాలో పర్యటించనప్పుడు అంజూ అంతా సోబర్స్తోనే ఉంది. వారిద్దరు అలా ప్రేమలో మునిగిపోయారు. అప్పుడు అంజు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. తర్వాత విండీస్ వెళ్లాక సోబర్స్, అంజు ఫోన్లోనే ఎక్కువుగా ప్రేమించుకునే వారు. ఆ తర్వాత విండీస్ జట్టు ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లింది.
అక్కడ సోబర్స్ ఫ్రు కిర్బీ అనే అమ్మాయితో ప్రేమాయణం నడిపాడు. ఆ తర్వాత సోబర్స్ అంజూకు ఫోన్ చేసి సారీ చెప్పడంతో పాటు తాను అంజూను మర్చిపోలేతున్నానని.. అయినా కొన్ని కారణాల వల్ల కిర్బీని పెళ్లి చేసుకుంటున్నట్టు చెప్పాడు. ఆ తర్వాత సోబర్స్ ఆమెను పెళ్లి చేసుకున్నా అంజూ మాత్రం అలా ఒంటరిగానే ఉండిపోయింది.
ఇదే విషయాన్ని గ్యారీ సోబర్స్ తన మై ఆటో బయోగ్రఫీ పుస్తకంలో రాసుకున్నాడు. అంజూ మంచి అమ్మాయి అని.. ఆమెతో జీవితం పంచుకోవాలని అనుకున్నా కుదర్లేదని.. ఎంతో బాధతో తాను ఇండియాను వదిలి వచ్చానని రాసుకున్నాడు.