Moviesమ‌రోసారి చైతు - స‌మంత జంట‌గా సినిమా... ఆ అడ్వాన్స్ సంగ‌తేంది...

మ‌రోసారి చైతు – స‌మంత జంట‌గా సినిమా… ఆ అడ్వాన్స్ సంగ‌తేంది ?

అక్కినేని నాగచైతన్య-సమంత జంట అటు ఆన్ స్క్రీన్ మీద‌.. ఇటు ఆఫ్ స్క్రీన్ మీద కూడా సూప‌ర్ లవ్లీ ఫెయిర్ జంట‌గా నిలిచింది. ప‌దేళ్లలో వారు నాలుగు సినిమాల్లో క‌లిసి న‌టించారు. మ‌రో సినిమాలో స‌మంత హీరోయిన్‌గా చేస్తే చైతు గెస్ట్ రోల్ చేశాడు. ఈ ఐదు సినిమాల్లో నాలుగు సూప‌ర్ హిట్లు. పైగా అక్కినేని ఫ్యామిలీ సినిమా మ‌నంలోనూ చైతు ప‌క్క‌న న‌టించే ల‌క్కీ ఛాన్స్ స‌మంత కొట్టేసింది.

విచిత్రం ఏంటంటే పెళ్లి త‌ర్వాత కూడా వీరు క‌లిసి న‌టించిన మ‌జిలీ ఎంత హిట్ అయ్యిందో చూశాం. ఓ బేబీలో చైతు గెస్ట్ రోల్ చేశాడు. అది కూడా సూప‌ర్‌గా ఆడింది. ఇక వీరి ఆన్ స్క్రీన్ రొమాన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వీళ్లు నాలుగు సినిమాల్లో క‌లిసి న‌టించినా మ‌ళ్లీ మ‌ళ్లీ జోడీ క‌ట్టినా కూడా ప్రేక్ష‌కులు చూసేందుకే ఇష్ట‌ప‌డ్డారు.

పెళ్ల‌య్యాక కూడా వీరు మ‌జిలీ చేస్తే హిట్ చేశారు. అదే ఈ జంట‌పై ప్రేక్ష‌కుల్లో ఉన్న క్రేజ్‌కు నిద‌ర్శ‌నం. మ‌హా అయితే ఒక‌టి రెండు నెల‌ల నుంచే వీరి మ‌ధ్య గొడ‌వ‌లు పెరిగిపోయాయి. అంత‌కు ముందే వీరు మ‌ళ్లీ జంట‌గా క‌నిపించేందుకు సిద్ధ‌మ‌య్యారు. వీరి కాంబోలో ఓ క్రేజీ ద‌ర్శ‌కుడు వెబ్ సీరిస్ కూడా ప్లాన్ చేసిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

ఓ అగ్ర నిర్మాత సైతం వీరి కాంబినేష‌న్ సెట్ చేసేందుకు ఇద్ద‌రికి భారీ అడ్వాన్స్‌లు కూడా ఇచ్చార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చెపుతున్నాయి. అంత‌లోనే వీరు విడిపోయారు. మ‌రి ఆ అడ్వాన్స్ నేప‌థ్యంలో మ‌రోసారి వీరు జంట క‌డ‌తారా ? అంటే చెప్ప‌లేం. ఎంత పెద్ద నిర్మాత అడ్వాన్స్ ఇచ్చినా కూడా అదే చైతు మ‌రో హీరోయిన్‌తో చేస్తాడేమో గాని… స‌మంత‌తో జ‌త క‌ట్ట‌క‌పోవ‌చ్చు. ఇక మళ్లీ వీరిని తెరపై జంటగా చూసే అవకాశం లేద‌నే అనుకోవాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news