Moviesగృహ‌ల‌క్ష్మి ఫేం లాస్య గురించి ఈ నిజాలు తెలుసా..!

గృహ‌ల‌క్ష్మి ఫేం లాస్య గురించి ఈ నిజాలు తెలుసా..!

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో చాలా మంది యాంక‌ర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి త‌ర్వాత సినిమాల్లోకి, టీవీ సీరియ‌ల్స్‌లోకి ఎంట్రీ ఇస్తూ స‌క్సెస్ అవుతున్నారు. మ‌రి కొంత‌మంది యాంక‌ర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి త‌ర్వాత బుల్లితెర‌పై ఎంట్రీ ఇచ్చి అక్క‌డ కూడా స‌క్సెస్ ఫుల్‌గా దూసుకు పోతున్నారు. ఈ లిస్టులోకే వ‌స్తుంది యాంక‌ర్ ప్ర‌శాంతి. త‌న మాట‌ల తూటాల‌తో పాటు అందంతో యాంక‌ర్‌గా తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసిన ఆమె ఆ త‌ర్వాత సీరియ‌ల్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

గృహ‌ల‌క్ష్మి అనే పాపుల‌ర్ సీరియ‌ల్‌లో లాస్య అనే పాత్ర‌లో న‌టిస్తూ అంద‌రి చేత ప్ర‌శంస‌లు అందుకుంటోంది. ఆమె ఓ విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లో న‌టిస్తూ తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైంది. ముందు మోడ‌ల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె ఆ త‌ర్వాత యాంక‌ర్‌గా కొన్నేళ్ల పాటు తెలుగు తెర‌పై ఓ ఆటాడింది. యాంక‌ర్‌గా పాపుల‌ర్ అవుతున్న టైంలోనే ఆమె ఎఫైర్ అనే అడ‌ల్ట్ సినిమాలో న‌టించి అంద‌రికి షాక్ ఇచ్చింది.

మొట్ట‌మొద‌టి లెస్బియ‌న్ మూవీగా వ‌చ్చిన ఎఫైర్ ఆమె గీతాంజ‌లి అనే అమ్మాయితో క‌లిసి చాలా హాట్ హాట్ సీన్ల‌లో న‌టించింది. అయితే ఈ సినిమాతో ఆమెకు క్రేజ్ రాలేదు స‌రిక‌దా… చాలా విమ‌ర్శలు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. ఆ త‌ర్వాత ఆమెకు సినిమా ఛాన్సులు రాలేదు. ప్ర‌స్తుతం స్టార్ మాలో వ‌స్తోన్న ఇంటింటి గృహలక్ష్మి సీరియ‌ల్‌లో లాస్య అనే నెగిటివ్ పాత్ర‌లో న‌టిస్తూ తెలుగు ప్రేక్ష‌కుల మ‌దిలో నిలిచిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news