Moviesసీనియ‌ర్ హీరోయిన్ శోభ‌న ఆ కార‌ణంతోనే పెళ్లి చేసుకోలేదా ?

సీనియ‌ర్ హీరోయిన్ శోభ‌న ఆ కార‌ణంతోనే పెళ్లి చేసుకోలేదా ?

సీనియ‌ర్ న‌టి శోభ‌న తెలుగు సినీ ప్రేక్ష‌కుల్లో త‌న‌కంటూ ఓ ఇమేజ్ ఏర్ప‌రుచుకుంది. 1990వ ద‌శ‌కంలో స్టార్ హీరోలతో న‌టించిన ఆమె న‌ట‌న‌కు వంక పెట్ట‌లేం. ఆమె క‌ళ్ల‌తో ప‌లికించే అభిన‌యం ఎంతో ప్ర‌త్యేకంగా ఉండేది. మోహ‌న్‌బాబు, రాజేంద్ర ప్ర‌సాద్‌, చిరంజీవి, బాల‌య్య‌, నాగార్జున ప‌క్క‌న ఆమె ఎన్నో హిట్ సినిమాల‌లో న‌టించింది. మోహ‌న్‌బాబుతో ఆమె న‌టించిన రౌడీగారి పెళ్లాం – అల్లుడు గారు రెండూ సూప‌ర్ హిట్ అయ్యాయి. చిరంజీవితో ఆమె చేసిన రౌడీ అల్లుడు బ్లాక్ బ‌స్ట‌ర్‌.

నాగార్జున‌తో చేసిన ర‌క్ష‌ణ హిట్ అయ్యింది. బాల‌య్య‌తో చేసిన నారీనారీ న‌డుమ మురారి కూడా బ్లాక్ బ‌స్ట‌ర్‌. అప్ప‌ట్లో ఆమె స్టార్ హీరోల‌తో పోటీ ప‌డి మ‌రీ డ్యాన్స్ చేసేది. ఆ త‌ర్వాత సినిమాల‌కు దూర‌మైన ఆమె చెన్నైలో ఓ డ్యాన్స్ స్కూల్ పెట్టుకుని పిల్ల‌ల‌కు డ్యాన్స్ , భ‌ర‌త నాట్యం నేర్పుతూ కాలం గ‌డిపేసింది. అయితే శోభ‌న ఎందుకో గాని ముందు నుంచి వైవాహిక జీవితం విష‌యంలో విముఖంగానే ఉంది.

ఆమె పెళ్లి చేసుకోలేదు. భ‌ర‌త‌నాట్యంలో పిల్ల‌ల‌కు శిక్ష‌ణ ఇస్తూ ఓ బాబును ద‌త్త‌త తీసుకుని కాలం గ‌డిపేస్తోంది. చాలా ఏళ్ల త‌ర్వాత తెలుగులో మోహ‌న్‌బాబు ప‌క్క‌న కృష్ణార్జున సినిమా చేసిన ఆమె ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ప‌క్క‌న లూసీఫ‌ర్ రీమేక్ గాడ్‌ఫాద‌ర్ సినిమాలో న‌టించేందుకు రెడీ అవుతోంది. మ‌ళ‌యాళంలో మంజూ వారియ‌ర్ చేసిన పాత్ర‌ను తెలుగులో శోభ‌న‌తో చేయించేందుకు ద‌ర్శ‌కుడు మోహ‌న రాజా రెడీ అవుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news