Moviesషాకింగ్ మ్యాటర్ లీక్ చేసిన మహేష్ బాబు..అబ్బ ఇక ఫ్యాన్స్ కు...

షాకింగ్ మ్యాటర్ లీక్ చేసిన మహేష్ బాబు..అబ్బ ఇక ఫ్యాన్స్ కు పండగే..!!

 

బాహుబ‌లి చిత్రంలో తెలుగు సినిమా సత్తా ఏంటో యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు రాజమౌళి.. షూటింగ్ విష‌యంలో మాత్రం ఎప్పుడూ లేటే. దాదాపు ఐదేళ్లు క‌ష్ట‌ప‌డి బాహుబ‌లి చిత్రాన్ని జ‌క్క‌న్న తెర‌కెక్కించాడు. ఆయ‌న‌పై న‌మ్మ‌కంతో ప్రభాస్ కూడా తన కెరీర్లో 5 ఏళ్లు బాహుబ‌లికే కేటాయించాడు. అయితే రాజ‌మౌళి ప్ర‌స్తుతం చేస్తున్న ఆర్ఆర్ఆర్‌ చిత్రం షూటింగ్ కొన్ని చిన్న చిన్న సీన్స్ మినహా పూర్తి చేసి రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాడు.

ఈ క్ర‌మంలో ఆర్ఆర్ఆర్‌ సినిమాను ఎప్పుడో రిలీజ్ చేయాల్సింది. కానీ, జ‌క్క‌న్న మాత్రం కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా రిలీజ్ చేయ‌లేక డేట్‌ను వాయిదా వేశారు. దీంతో ఇప్పుడు ఈ సినిమా ఎప్పుడు విడుద‌ల అవుతుందో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. అయితే ఈ సినిమా తరువాత రాజమౌళి టాలీవుడ్ ప్రీన్స్ మహేష్ బాబు తో ఓ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇప్పటికే మహేష్ బాబు కోసం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే రాజమౌళి మహేష్ బాబుతో ఓ ఆఫ్రికన్ జంగిల్ అడ్వెంచర్ చేయాలని చూస్తున్నట్టు విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆ సినిమా ఎలా చేయగలమని ఆలోచనలో ఉన్నట్లు ఈ సందర్భంగా మహేష్ బాబు సినిమా గురించి లీక్ చేశారు.

ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం సర్కారు వారి పాట. స‌రిలేరు నీకెవ్వ‌రు లాంటి సూప‌ర్ హిట్ త‌ర్వాత మ‌హేష్ న‌టిస్తోన్న ఈ సినిమాపై లెక్క‌కు మిక్కిలిగా అంచ‌నాలు ఉన్నాయి. మ‌హేష్ మూడు వ‌రుస హిట్ల‌తో ఫుల్‌స్వింగ్లో ఉన్నాడు. దీంతో స‌ర్కారు వారి పాట హిట్ అయితే మ‌హేష్ క్రేజ్ ఏ రేంజ్‌కు వెళ్లిపోతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప్రస్తుతం మహెష్ బాబు ఈ సినిమా షూటింగ్‌ లో బిజీ బిజీగా ఉన్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news