ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసులు దోచుకున్న బ్యూటీ సాయి పల్లవి. సాయిపల్లవి ప్రేమమ్ చిత్రంతో ఒక్కసారిగా సౌత్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. ప్రేమమ్ తెచ్చిన క్రేజ్ తో తెలుగులో ఫిదా చిత్రంలో నటించే అవకాశాన్ని అందుకుంది. ఫిదా చిత్రం తర్వాత సాయి పల్లవి క్రేజ్ టాలీవడ్‌లో అమాంతం పెరిగింది. కేవలం నటన, అభినయంతోనే సాయి పల్లవి యువతకు బాగా చేరువైంది.
ప్రస్తుతం ఫీల్‌గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా లవ్ స్టోరీ అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చై-సాయి పల్లవిల కెమిస్ట్రీ అదిరిపోనుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మీడియా తో ముచ్చటించిన సాయి పల్లవి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది.
ఈ క్రమంలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల గురించి మాట్లాడుతూ.. శేఖర్ కమ్ములతో పని చేయడం ఇది రెండోసారి అని. మొదట ఫిదా సినిమా చేసానని చెప్పుతూ.. శేఖర్ కమ్ముల వల్ల తనలో చాలా మార్పులు వచ్చాయని చెప్పుకొచ్చింది. తాను ఇంతకన్నా ముందు సున్నితంగా మారిపోయానని చెప్పుతూ.. శేఖ కమ్ముల గారు చాలా సింపుల్ గా ఉంటారు. ఎక్కడైనా సాధారణంగానే ఉంటారని, నేల మీదే కూర్చొని పనిచేస్తారని తెలిపింది. అలాంటి సాధారణ జీవితాన్ని తాను కూడా అలవాటు చేసుకున్నానని చెప్పుకొచ్చింది. లవ్ స్టోరీ ఎక్కువగా రూరల్ ఏరియాలో జరిగిందని.. ఆర్మూర్ దగ్గర పిప్రీలో చేశామని తెలిపింది.