Moviesమళ్ళీ పెళ్లి కూతురుగా ముస్తాబైన సమంత..దానికోసమేనట..?

మళ్ళీ పెళ్లి కూతురుగా ముస్తాబైన సమంత..దానికోసమేనట..?

సమంత.. టాలీవుడ్ కుందనప్పు బోమ్మ. చూడడానికి చక్కటి రూపం..అందరిని ఆకట్టుకునే మాటలు..అద్భుతమైన నటనతో అందరి మనసులను గెలుచుకుంది. ఇక టాలీవుడ్ బడా ఫ్యామిలీ అక్కినేని ఇంటి కోడళు గా అడుగుపెట్టి .. కోడలు గాను మంచి మార్కులు వేయించుకుంది. ఇక పెళ్లి తరువాత గ్యాప్ దొరికిన్నప్పుడల్ల భర్త నాగ చైతన్యతో టూర్ లు వేస్తూ.. ఆ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది.

అయితే గత కొద్ది రోజులుగా ఈ జంట మధ్య మనస్పర్ధలు వచ్చాయని..ఇక కలిసి జీవించలేరని..విడాకులు తీసుకోడానికి సిద్ధం అయ్యారని టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. ఆ పుకార్లకు తగ్గటే సమంత నాగ చైతన్య తో లేకుండా వేరే చోట ఉంటూ.. సింగల్ గా ఫోటోస్ పెడుతుంది. పోనీ..ఈ గాసిప్ రాయళ్లకు చెక్ పెట్టే విధంగా వాళ్లు ఏమన్నా క్లారిటీ ఇచ్చారా..? అంటే అది లేదు. వాటికి మాకు ఏం సంబధం లేదు అన్నట్లు..ఇద్దరికి ఇద్దరు సైలెంట్ గా ఉన్నారు. దీంతొ చలా మంది వీళ్లు నిజంగా డైవర్స్ తీసుకుంటున్నారెమో అని అనుకునే పరిస్ధితికి వచ్చింది వ్యవహారం.

ఇక ఇవేమి పట్టించుకోకుండా సమంత తాజాగా పెళ్లి కూతురు లుక్ లో దర్శనమిచ్చింది షాకిచ్చింది. సమంత తాజాగా సాంప్రదాయ చీరకట్టులో మెరిసింది. సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో తాజా ఫోటోషూట్‌లకు సంబంధించిన కొన్ని ఫోటోలను పంచుకుంది. ఇదంతా ఆమె ఓ ప్రముఖ కంపెనీ యాడ్ కోసం ఈ ఫోటోలు దిగినట్టు కన్పిస్తోంది. సామ్ తన పెళ్ళిలో కూడా దాదాపు ఇలాగే కన్పించింది. సామ్ అందమైన వధువు లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news