Moviesఅలా చేస్తే పగిలిపోద్ది..స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన బన్నీ..?

అలా చేస్తే పగిలిపోద్ది..స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన బన్నీ..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వస్తున్న క్రేజీ మూవీ పుష్ప. పాన్ ఇండియా రేంజ్‌లో ఐదు భాష‌ల్లో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా కనిపించనున్నారు. శేషాచ‌లం అడ‌వుల్లోని గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో ఈ సినిమా క‌థ ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయినా టీజర్ ,పుష్ప సినిమా ఫస్ట్ సింగిల్ దాక్కో దాక్కో మేక .. పాట యూట్యూబ్ ని షేక్ చేసింది. దీంతో బ‌న్నీ – సుకుమార్ కాంబినేష‌న్లో వ‌స్తోన్న పుష్ప‌పై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

అయితే ఆ మధ్య ఈ సినిమా నుంచి కొన్ని సన్నివేశాలు లీక్ అయ్యాయి. పాన్ ఇండియా ప్రాజెక్టుగా వస్తున్న ‘పుష్ప’ మూవీ నుంచి కొన్ని పిక్స్, పాట ముందే బయటకు వచ్చేశాయి. దీంతో చిత్ర నిర్మాతలు సైబర్ క్రైమ్ పోలీసులను కూడా ఆశ్రయించారు.ఇలాంటి లీక్‌ ల వల్ల సినిమా ప్రాఫిట్స్ విషయంలో భారీగా దెబ్బ తినే అవకాశం ఉందంటున్నారు సినీ విశ్లేషకులు ​లీకేజీ రాయుళ్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన.. మళ్ళి మరో వీడియో లీక్ కావడంతో..ఈ సినిమా చిత్ర యూనిట్ ..షూటింగ్ లో ఫోన్స్ బ్యాన్ చేసింది.

కానీ, షూటింగ్ స్పాట్ కు వస్తున్నా ఆయన అభిమానులు అక్కడ జరుగుతున్న సీన్స్ ని మొబైల్స్ లో షూట్ చేస్తుండడంతో.. దీంతో తాజాగా చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫోటోలు వీడియోలు తీసినచో సెల్ఫోన్లు పగలగొట్టబడును అంటూ ఒక బోర్డు ఏర్పాటు చేసింది. కానీ అభిమానులు వింటారా..?? ఎంత చెప్పినా ఫోటోలు వీడియోలు తీస్తూనే ఉన్నారట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news