నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. బోయపాటి – బాలయ్య కాంబో అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు అఖండ సైతం వీరి కాంబోలో ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా మీద అటు బాలకృష్ణ అభిమానులు మాత్రమే కాక సాధారణ ప్రేక్షకులు సైతం చాలా అంచనాలు పెట్టుకున్నారు. దానికి కారణం ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో నటిస్తూ ఉండడమే. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
అయితే బాలయ్య త్వరలోనే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి మనకు తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ దాదాపు కంప్లీట్ చేసిన గోపీచంద్ మలినేని .. అక్టోబర్ నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తాడనే టాక్ వినిపిస్తుంది. అయితే ఈ సినిమా కు సంబంధించిన తాజాగా ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. పల్నాడు ప్రాంతానికి చెందిన ఒక చరిత్రకారుడు కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుందని ప్రచారం జరుగుతూ ఉంది.
అయితే ఇప్పుడు తాజా సమాచారం మేరకు ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారని అంటున్నారు. ఈ సినిమా కోసం ఒక పవర్ ఫుల్ టైటిల్ ను ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేశారట. ఈ సినిమా కోసం రౌడీయిజం అనే టైటిల్ ఫిక్స్ చేశారనే టాక్ వినిపిస్తుంది. అంతే కాక ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రలు పోషిస్తున్న నేపథ్యంలో ఇద్దరు హీరోయిన్లు కావాల్సి ఉంటుంది. ఇప్పటికే ఒక హీరోయిన్ గా త్రిషను ఎంపిక చేశారనే ప్రచారం జరుగుతోంది. ఇక మరో హీరోయ్న్ గా తమన్నా ని అనుకుంటున్నారట. . ఇక ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తూ ఉండగా మైత్రీ మూవీ మేకర్స్ సినిమా నిర్మిస్తోంది.