Moviesఅదో మాదిరిగా..అందరిని ఆకటుకుంటున్న ‘మాస్ట్రో’ సాంగ్ లిరిక్స్‌..!!

అదో మాదిరిగా..అందరిని ఆకటుకుంటున్న ‘మాస్ట్రో’ సాంగ్ లిరిక్స్‌..!!

యంగ్ హీరో నితిన్.. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ హీరోలలో నితిన్ కూడా ఒకడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నితిన్.. ఈ సంవత్సరంలో ఇప్పటికే రెండు సినిమాలను విడుదల చేసారు నితిన్. అందులో చెక్ సినిమా ఆశించనంతగా హిట్ కాకపోగా.. రంగ్ దే మూవీ పర్లేదు అనే టాక్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ‘మ్యాస్ట్రో’ అంటూ మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సూపర్ హిట్ మూవీ ‘అంధాధూన్’ తెలుగు రీమేక్‌‌గా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది.

మ్యాస్ట్రో లో నితిన్ అంధుడిగా కనిపించనుండటం విశేషం. ఓటీటీ వేదిక హాట్ స్టార్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. నభా నటేష్, తమన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. నితిన్ సొంత నిర్మాణ సంస్థ ‘శ్రేష్ఠ్ మూవీస్’ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితా రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు.

ఇదిలా ఉంటే సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో ప్రచారంలో వేగం పెంచిన సినిమా యూనిట్‌ తాజాగా సినిమాకు సంబంధించి మరో పాటను విడుదల చేసింది.తాజాగా ఈ సినిమా నుంచి మరో లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ‘లా లా లా’ అని సాగే ఈ పాటలోని లిరిక్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మహతి స్వరసాగర్ అందించిన మ్యూజిక్ ఆకట్టుకునే విధంగా వుంది. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా, ధనుంజయ్ ఆలపించాడు. నికిత రెడ్డి – సుధాకర్ రెడ్డి నిర్మించారు. స్వర సాగర్‌ మహాతి పాటను పాడిన తీరు బాగుంది. మరి ఈ మెలోడి సాంగ్‌ను మీరూ ఓసారి వినేయండి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news