బిగ్‌బాస్ తెలుగు ఎంతో మంది కంటెస్టెంట్లకు గుర్తింపునిచ్చింది. బిగ్ బాస్ సీజన్ 4 కార్యక్రమం సక్సెస్ ఫుల్‌గా ముగియడంతో సెప్టెంబర్ 5 నుండి సీజన్ 5 మొదలైంది. ఈ సీజన్లో మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ ఉండగా,వారి మధ్య పోటీ ఆసక్తికరంగా మారనుంది. అయితే సీజన్ 4లో కూడా వాడివేడిగా పోటీ జరగగా, చివరకు అభిజీత్ విన్నర్‌గా నిలిచాడు. ఇక బిగ్‌బాస్ సీజన్ 4 విన్నర్ గా నిలిచిన అభిజీత్.. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాక.. అతని ఆటతీరుతో విపరీతమైన పాపులారిటీని సంపాదించారు. అభిజిత్ బిగ్‌బాస్ కు వెళ్ళకు ముందే శేఖర్ కమ్ముల తెరెక్కించిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో గుర్తింపు పొందాడు.
ఆ సినిమా తర్వాత అభిజిత్ అంతగా సినిమాల్లో నటించలేదు. చాలా కాలం తర్వాతా తిరిగి బిగ్‌బాస్ షోలో పాల్గోని మరింత ఫేమస్ అయ్యాడనడంలో సందేహం లేదు. హౌస్ లో మిస్టర్ కూల్‌గా ఆట ఆడి కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న సినీ హీరో అభిజిత్ బిగ్ బాస్ సీజన్ 4 విజేతగా అవతరించాడు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా బిగ్ బాస్ టైటిల్‌ను అందుకున్నాడు. 11 సార్లు నామినేట్ అయ్యి సేవ్ అవుతూ వచ్చిన అభిజిత్‌కి ప్రేక్షకులు పట్టం కట్టడంతో బిగ్ బాస్ సీజన్ 4 విజేత అయ్యి రూ. 25 లక్షల ఫ్రైజ్ మనీ అందుకున్నారు.
అభిజీత్ టైటిల్ విన్నర్ అయిన కూడా ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు. ఒక్కటి అంటే ఒక్క సినిమా కూడా తీయ్యలేదు. అయితే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కండోమ్ యాడ్‌కి సంబంధించిన ఓ ప్రకటన చేయడంతో తన అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. కండోమ్ లో పలు ఫ్లేవర్స్ వచ్చాయని తెలియజేస్తూ దానితో మంచి థ్రిల్ పొందొచ్చని తెలియజేశాడు.
View this post on Instagram
ఇక దీంతో సోషల్ మీడియాలో అభిజీత్ పై ట్రోల్స్ మొదలైయ్యాయి. ఈ కండోమ్‌పై యాడ్‌పై నెటిజన్స్ భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. చివరికి కండోమ్‌లు అమ్ముకునే పరిస్థితి వచ్చిందా అభిజీత్ అంటూ సెటైర్స్ వేస్తున్నారు. బిగ్ బాస్ విన్నర్ అయితే ఏక్కడికికో వెళ్లిపొతావ్ అనుకున్నావ్..లాస్త్ కి ఇలాంటి పరిస్ధితి వచ్చిందా నాయనాంటూ కామెంత్స్ పెడుతున్నారు.
View this post on Instagram