Moviesప‌వ‌న్ సినిమాకి పవర్ ఫుల్ టైటిల్‌… ఏం ట్విస్ట్ ఇచ్చావ్ సామీ..??

ప‌వ‌న్ సినిమాకి పవర్ ఫుల్ టైటిల్‌… ఏం ట్విస్ట్ ఇచ్చావ్ సామీ..??

పవన్ కళ్యాణ్ వ‌రుస క్రేజీ ప్రాజెక్ట్లతో దూసుకుపోతున్నారు. వకీల్ సాబ్ తో తిరుగులేని విజయం అందుకున్న ప‌వ‌న్ ..ప్ర‌స్తుతం అయ్య‌ప్ప‌నుమ్ కోషియ‌మ్ రీమేక్‌ చిత్రంతో బిజీగా ఉన్నారు. భీమ్లా నాయ‌క్ అనే టైటిల్‌తో ఈ చిత్రం రూపొందుతుండ‌గా, ఇందులో ప‌వ‌న్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్నారు. ఇక ఆ తరువాత క్రిష్ దర్శకత్వంలో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు అనే సినిమా చేస్తున్నారు పవన్. ప‌వ‌న్ – క్రిష్ కాంబోలో తెర‌కెక్కుతోన్న సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. చారిత్ర‌క నేప‌థ్యంలో ఈ సినిమా క‌థ ఉంటుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.ఈ సినిమాను శ్రీ సూర్యా మూవీస్ బ్యాన‌ర్‌పై ఏఎం. ర‌త్నం నిర్మిస్తున్నారు.

ఇక ఆ తరువాత క్రేజీ కాంబినేషన్ గా పవన్ హారిష్ శంకర్ డైరెక్షన్ లో ఓ సినిమా తీయబొతున్నాఉ. ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ లో ఒక బండి మీద పుస్తకంతో పాటుగా ఆ పోస్టర్ లో స్వాతంత్య్ర‌ సమరయోధులు సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫోటోలను ఉంచారు.ఈ ఫొటోలు చూస్తే దేశ‌భ‌క్తికి సినిమాలో హీరోకు లింక్ ఉంటుంద‌ని తెలుస్తోంది. హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించే ఈ సినిమాను మైత్రీ మూవీస్ వారు నిర్మిస్తున్నారు. వాస్త‌వానికి మూడేళ్ల క్రిత‌మే ప‌వ‌న్‌తో సినిమా చేసేందుకు మైత్రీ మూవీస్ వారు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. త‌ర్వాత ప‌వ‌న్ రాజ‌కీయాల్లోకి వెళ్ల‌డంతో ఈ ప్రాజెక్టు కాస్త ఆల‌స్యంగా ప‌ట్టాలు ఎక్కుతోంది.

క్రిష్ సినిమా కంప్లీట్ చేసి హ‌రీష్ శంక‌ర్ ప్రాజెక్టులో ప‌వ‌న్ జాయిన్ అవుతాడు.హ‌రీష్ శంక‌ర్-ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాపై అభిమానుల‌లో భారీ అంచ‌నాలు ఉండ‌గా, ఇది దేశ భ‌క్తి నేప‌థ్యంలో రూపొందుతున్న‌ట్టు తెలుస్తుంది. ఈ సినిమాకి భ‌గ‌త్ సింగ్ అనే టైటిల్ ఫిక్స్ చేయ‌నున్నార‌ని తెలుస్తుంది. సినిమా క‌థ‌కి టైటిల్‌కి స‌రిగ్గా స‌రిపోతుంద‌ని మేక‌ర్స్ ఈ టైటిల్ ఫైన‌ల్ చేసిన‌ట్టు తెలుస్తుంది. ఇందులో మొదట హీరోయిన్ గా సమంత ని అనుకోగా..ఫనల్ గా పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news