సినిమా వాళ్ల జీవితాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరి జీవితాలు ఎప్పుడు ఎవరితో ? ఎలా ? ప్రారంభమవుతారో ? ఎప్పుడు ఎవరితో ఏ బంధం ఎలా ముగుస్తుందో ? కొత్త బంధం ఎలా స్టార్ట్ అవుతుందో ? ఎవ్వరం అంచనా వేయలేం. అంతెందుకు నాగచైతన్య – సమంత తమ కాంబోలో వచ్చిన తొలి సినిమా నుంచే చాలా సీక్రెట్‌గా ప్రేమించుకున్నారు. నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. అప్పుడే వీరి విడిపోతున్నారంటూ ఒక్కటే వార్తలు వస్తున్నాయి. సరే ఇందులో నిజానిజాలు ఎలా ? ఉన్నా కొందరు హీరోయిన్లు పెళ్లయ్యి భర్తలు ఉన్నా కూడా మరో వ్యక్తి మోజులో పడి తమ భర్తలను టార్చర్ పెట్టారన్న చర్చలు అయితే జరిగాయి. ఇందులో ఆ మొదటి భర్తలే ఆ హీరోయిన్లను ఇబ్బంది పెట్టారా ? లేదా ? హీరోయిన్లే వారిని ఇబ్బంది పెట్టారా ? అన్నది పక్కన పెడితే .. ఈ తరహా వార్తల్లోకి ఎక్కిన హీరోయిన్ల గురించి తెలుసు కుందాం..!
ఈ లిస్టులో బాలీవుడ్ అందాల అలనాటి నటి రేఖ ఉంటారు. ఆమెకు ముందుగా అమితాబచ్చన్‌తో అనేక సినిమాల్లో నటించింది. అప్పుట్లో వారి మధ్య ప్రేమ నడిచిందన్న వార్తలు బీ టౌన్లో ఎక్కువుగా వినిపించేవి. ఆ తర్వాత ఆమె తన భర్తతో కలిసి ఉండేందుకు ఇష్టం లేక వేధించడంతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడన్న ప్రచారం ఉంది. ఇక కోలీవుడ్ నటి వనితా విజయ్ కుమార్ అయితే ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురికి దూరమైంది. ఆమె తొలి ఇద్దరు భర్తలు చాలా మంచివారే అన్న టాక్ ఉంది. అయితే వనిత టార్చర్ పడలేకే వాళ్లిద్దరు ఆమెకు దూరమయ్యారని అంటారు.
ఇక మళయాళ హీరోయిన్ కావ్య మాధవన్ కూడా తక్కువేం కాదు. ఆమెకు 2009లో నిశ్చల్ చంద్ర అనే వ్యక్తితో పెళ్లయ్యింది. ఆమె దిలీప్ కుమార్‌తో ఎక్కువ సినిమాలు చేయడంతో అతడితో ప్రేమలో పడింది. చివరకు అతడిని పెళ్లాడేందుకే తన భర్తను వేధించడంతో అతడు విడాకులు ఇచ్చాడు. ఇటు దిలీప్ కూడా తన భార్యకు విడాకులు ఇచ్చి కావ్య మాధవన్‌కు దగ్గరయ్యాడు.
ఇక మరో సీనియర్ హీరోయిన్ రేఖ గురించి తెలిసిందే. ఆమె ముందుగా దర్శకుడు ప్రతాప్ పోతన్‌ను పెళ్లాడింది. అతడితో పొసగక బ్రిటన్‌కు చెందిన వ్యక్తిని పెళ్లాడి అతడికి కూడా విడాకులు ఇచ్చింది. ఆమె తీరుతో విసిగిపోయే వారు ఆమెకు దూరమయ్యారన్న ప్రచారం కూడా ఉంది. ఆ తర్వాత ఆమె శరత్‌కుమార్‌ను ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నారు.
ఇక మరో సీనియర్ నటి జయంతి కూడా ముందుగా పేకేటి శివరాంను పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఆయనకు దూరమై మరో వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్నారు. చివరకు అతడికి కూడా విడాకులు ఇచ్చి.. తనకంటే వయస్సులో 20 ఏళ్లు చిన్నవాడు అయిన రాజశేఖర్ అనే యువకుడిని ఆమె పెళ్లాడారు. అయితే అతడికి కూడా ఆమె విడాకులు ఇచ్చారు.