స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సంక్రాంతికి వచ్చిన అల వైకుంఠపురంలో సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో బన్నీ క్రేజ్ మామూలుగా లేదు. ఇప్పుడు బన్నీ సౌత్ ఇండియా సూపర్ స్టార్‌గా మారిపోయాడు. కరోనా లాక్డౌన్ వల్ల గత కొన్ని నెలలుగా షూటింగ్‌కు గ్యాప్ రావడంతో ఇప్పుడే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళుతున్నారు. బన్నీ మాత్రం వచ్చే సమ్మర్ నాటికి షూటింగ్ ఫినిష్ చేసి రిలీజ్ చేయాలని సుకుమార్‌కు కండీషన్ పెట్టాడట. అయితే సుకుమార్ మాత్రం 2021 ఎండింగ్ వరకు షూట్ చేసి 2022 సంక్రాంతి రేసులో సినిమాను ఉంచాలని చూస్తున్నాడట. సుకుమార్ సినిమాను లేట్ అయినా బాగా చెక్కుకు రావాలని చూస్తున్నా బన్నీ మాత్రం వచ్చే సమ్మర్‌కే రిలీజ్ చేసేలా షూటింగ్ పినిష్ చేయాలని కండీషన్ పెడుతున్నాడట.
సమ్మర్లో పుష్ప రిలీజ్ అయితే ఆ వెంటనే కొరటాల శివ సినిమాకు సిద్ధం అయ్యేలా బన్నీ ప్లాన్ చేస్తున్నాడు. ఇక బన్నీ సినిమాలను డబ్ చేస్తే ఏ రేంజ్ క్రేజ్ ఉంటుందో చెప్పక్కర్లేదు. బన్నీ – సుకుమార్ కాంబినేషన్లో వస్తోన్న పుష్పపై భారీ అంచనాలు ఉన్నాయి. పుష్ప టీజర్ యూట్యూబ్ ని షేక్ చేసింది. దీంతో సినిమా డబ్బింగ్ రైట్స్ కోసం భారీ డిమాండ్ నెలకొంది.చివరకు భేరసారాల తర్వాత కేవలం హిందీ డబ్బింగ్ రైట్స్ ను రు. 17 కోట్లకు అమ్మేశారని తెలుస్తోంది. ఇది పుష్ప ఫస్ట్ పార్ట్ రేటు మాత్రమే. రెండో పార్ట్ ను మళ్లీ అమ్ముతారు. ఈ రేటు చూస్తుంటే పుష్ప ప్రి రిలీజ్ బిజినెస్ రేంజ్ , బన్నీ స్టామినా ఏంటో తెలుస్తోంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నారు.
ఇక అల్లు అర్జున్ పుష్ప సినిమా నుంచి బయటకు వచ్చిన ఫస్ట్ సింగిల్ దాక్కో దాక్కో మేక .ఆగస్ట్ 13 ఉదయం విడుదలైన ఈ పాట నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అలా దాక్కో దాక్కో మేక అనే పాట ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. అయితే ఈ పాట మీద పూనమ్ కౌర్ స్పందిస్తూ.. ప్యాషన్, హార్డ్ వర్క్ అంటే ఇదే అని చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారు, డీఎస్పీ గారు అంటూ అందరి పేర్లు ప్రస్తావించింది. మొత్తానికి పుష్ప లుక్ పూనమ్ కౌర్‌కు బాగానే నచ్చినట్టుంది.