Gossipsహీరోయిన్ గానే చేస్తా లేదంటే సినీ ఇండస్ట్రీనే వదిలేస్తా.. బంపర్ ఆఫర్...

హీరోయిన్ గానే చేస్తా లేదంటే సినీ ఇండస్ట్రీనే వదిలేస్తా.. బంపర్ ఆఫర్ ను రిజెక్ట్ చేసిన కుర్ర హీరోయిన్..?

ఈ రంగుల ప్రపంచం అంటే సినీ ఇండస్ట్రీ లోకి రావడం అంటేనే కష్టం. ఏదోలాగ వచ్చినా అంత సులువుగా అవకాశాలు రావు. దానికి ఎంతో తతంగాలు ఉంటాయి. అని అధికమించి వచ్చినా మంచి ఛాన్స్ లు రావు. ఏదో చిన్న క్యారెక్టర్ లు వస్తాయి. అయితే , వచ్చిన అవకాశాని ఏదైనా సరే సద్వినియోగం చేసుకుంటేనే ఏ రంగంలోనైనా సక్సెస్ అవ్వగలం. లేదు..కాదు..నాకు ఇదే కావాలి..అది వద్దు అంటే ..ఇంకెముంది వచ్చిన అవకాశం కూడా గోవింద గోవిందా..

ప్రస్తుతం ఇలాగే చేసింది సినీ ఇండస్ట్రీలో ఓ టాప్ హీరోయిన్. మొదట్లో ఒక్క హిట్ కొట్టడానికి ఎన్నో కష్టాలు పడ్డిన ఈ హీరోయిన్..ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగానే..కళ్ళు ఆకాశనికి ఎక్కిపోయాయి అంటున్నారు సినీ పెద్దలు. స్టార్ హీరోయిన్లు సైతం మంచి ఆఫర్లు వస్తే ఇతర చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించి సందడి చేస్తుంటారు. అయితే ఓ హీరోయిన్ మాత్రం వచ్చిన అవకాశాన్ని కాదంటూ కాలదన్నుకుందన్న వార్త ప్రస్తుతం టాలీవుడ్ లో వైరల్ గా మారింది. ఓ అగ్ర హీరో సినిమాలో కీలక పాత్ర కోసం ఆమెను సంప్రదించగా నేను హీరోయిన్ గా తప్ప ప్రత్యేక పాత్రల్లో చేయను అంటూ కుండబద్దలు కొట్టినట్టు నో చెప్పేసిందట.

అంతేకాదు.. చేస్తే హీరోయిన్ రోల్స్ నే చేస్తా.. లేదంటే సినీ ఇండస్ట్రీ వదిలేస్తా..అంతే..నాకు ఇష్టం లేని పని..నాకు నచ్చని పాత్రలు నేను చేయను అంటూ గట్టిగా చెప్పిందట. ఇక ఆ డైరెక్టర్ ఏం చేస్తాడు.. నీ కర్మ అని వదిలేసి.. ఆ ఆఫర్ ను బిగ్ బాస్ బ్యూటికి ఇచ్చేసాడట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు ఆమె అవకాశం మిస్ చేసుకున్న సినిమా ఏది అన్న వివరాలు పూర్తిగా రివీల్ కాలేదు. కానీ ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news