దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న “RRR” సినిమా కోసం యావత్ టాలీవుడ్ ఆడియెన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాకు ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. ఈ సినిమా కోసం తెలుగు ఆడియెన్స్‌తో పాటు ఇతర భాషల ఆడియెన్స్ కూడా చాలా ఆశగా చూస్తున్నారు.
ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధుల పాత్రల్లో తారక్, చరణ్‌లు నటిస్తున్న విషయం చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది. పాన్ ఇండియా కేటగిరిలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు టీజర్లు సినిమా పై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. గత మూడేళ్ళుగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం చివరి దశకు వచ్చేసింది. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో జాతీయ స్థాయి తారలు నటిస్తున్నారు. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి.
సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ రోజు ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా.. కీరవాణి స్వరపరిచిన ఫస్ట్ సింగిల్ ”దోస్తీ” అనే పాటను విడుదల చేశారు. ఈ పాటను అనిరుధ్ రవిచంద్రన్ – అమిత్ త్రివేది – విజయ్ ఏసుదాసు – యాజిన్ నజీర్ వంటి ఐదుగురు ప్రముఖ సింగర్స్ పాడారు.
తెలుగు వెర్సన్ పాటను హేమచంద్ర ఆలపించగా.. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు. ఇక ఈ పాటతో మరోసారి కీరవాణి తన సత్తా చాటారు. తన అధ్భుతమైన సంగీతంతో అందరిని అందరిని మెస్మరైజ్ చేశారనే చెప్పాలి. అలాగే ఈ పాటలో సీతారామశాస్త్రి సాహిత్యం ప్రతీ లైన్ ను అద్భుతంగా రాశారు.
ఇక ఈ సినిమా విష్యనికి వస్తే.. కొమరం భీం, అల్లూరి సీతారామరాజు మధ్య ఎమోషనల్ బాండింగ్ సూపర్బ్‌గా ఉంటుందని .. అంతేకాకుండా క్లైమాక్స్‌లో వచ్చే ఓ భీకర పోరాట సన్నివేశంలో ఎన్టీఆర్ నటన పీక్స్‌లో ఉంటుందని చెపుతున్నారు చిత్ర బృందం. ఈ యాక్షన్ సీన్‌లో ఎన్టీఆర్ విరోచిత నటన తర్వాత ఎమోషనల్ సీన్లలో జీవించేస్తాడని.. ఈ పతాక సన్నివేశం ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యున్నత సన్నివేశంగా నిలిచి పోతుందని ఈ సినిమాకు పనిచేసిన వారు చెపుతున్నారు. ఈ క్లైమాక్స్ సీన్ .. జక్కన్న సైతం ఎన్టీఆర్ నటనకు మంత్ర ముగ్ధుడు అయ్యాడని చెపుతున్నారు.