Moviesనోటి దూల..రోషం పోడుచుకొచ్చింది..పరువు పాయ్యే..!!

నోటి దూల..రోషం పోడుచుకొచ్చింది..పరువు పాయ్యే..!!

అక్కినేని.. ఈ పేరుకి టాలీవుడ్ లో ఈ ప్రత్యేకమైన స్దానం ఉంది. అక్కినేని నాగేశ్వరవు ఎంతో కష్టపడి.. తన నటనతో మనల్ని మెప్పించారు. అలాగే ఆయన నాట వార్సత్వం పుచ్చుకున్న నాగార్జున కూడా.. తండ్రి పేరు కి ఈ మాత్రం ఆటంకం కలగనీయకుండా..ఆ అక్కినేని బ్రాండ్ ను అల్లగే కొనస్సగించారు. ఇప్పుడు మూడోతరంగా అక్కినేని నాగచైతన్య-అక్కినేని అఖిల్ ఆ పేరు పైకి తిసుకొస్తున్నారు. అయితే.. ఈ అక్కినేని వారింటా మరోసారి పెళ్లి భాజాలు మోగుతున్నాయంటూ ఓ వారత చక్కర్లు కొట్టిన సంగతి తెలిసందే.

అక్కినేని నాగేశ్వరరావు మనవడుగా.. నాగార్జున మేనల్లుడుగా ఇండస్ట్రీలోకి వచ్చిన సుమంత్ హీరోయిన్ కీర్తిరెడ్డిని పెళ్లి చేసుకుని.. వీరిద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో విడిపోయారు. ఇక ఆ తరువాత సుమంత్ మాత్రం ఒంటరిగానే గడుపుతున్నారు. అయితే, గత కొద్ది రోజులుగా ఆయన రెండో పెళ్ళి చేసుకోబోతున్నారని..ఆ అమాయి పేరు పవిత్ర అని.. పెళ్లి కార్డు కూడా లీకైంది. దీంతో నిజంగానే సుమంత్ రెండో పెళ్లి చేసుకుంటున్నాడు అని అంతా అనుకునారు. ఇక కాంట్రవర్సీ డైరెక్టర్ RGV.. అదే రాం గోపాల్ వర్మ..తనదైన స్టైల్ లో స్పందించారు. సుమంత్ ని ట్యాగ్ చేసి మరీ ‘పెళ్లంటే పెద్ద పెంట’ అంటూ పోస్టింగ్ పెట్టాడు. సుమంత్ కూడా ఇక తప్పదని స్పందించేశాడు!.

 

ఈ నేపథ్యంలో సుమంత్‌ కి రోషం పోడుచుకొచ్చింది..తన రెండో పెళ్లి వార్త పై స్పందించారు. ఆయన అధికారిక ట్విట్టర్‌ ద్వారా ఈ పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. తాను రెండో పెళ్ళి చేసుకోవడం లేదని క్గరాకండీగా చెప్పాడు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన వెడ్డింగ్‌ కార్డ్ తన నెక్ట్స్ సినిమాకి సంబంధించినదని వెల్లడించాడు. రియల్‌ లైఫ్‌లో తాను మళ్లీ పెళ్లి చేసుకోవడం లేదని, వైరల్‌ అయిన వెడ్డింగ్‌ కార్డ్ తన తదుపరి సినిమాకి సంబంధించినది తెలిపాడు.

 

దీనికి రాం గోపాల్ వర్మ మళ్ళి రిప్లై ఇచ్చాదు. ఈ విషయం చెప్పినందుకు థ్యాంక్స్ సర్.. ఇదంతా సినిమా కోసమే అని చెప్పినందుకు ఆ దేవుడికి దయ్యానికి థ్యాంక్స్. మళ్లీ మొదలైందది అనే సినిమాను అందరూ చూడండి.. పెళ్లి గురించి కఠిన సత్యాలను తెలుసుకోండి.. పెళ్లి అనేది నరకంలో ప్రమాదవశాత్తు జరిగేదని తెలుసుకోండని వర్మ అన్నారు.

 

అయితే, చాలా మంది నెటిజన్స్ సుమంత్ మళ్లీ పెళ్లి చేసుకోవటం లేదని డిజపాయింట్ అయితే.. కొందరు మాత్రం ఇదంతా పబ్లిసిటీ కోసమే సుమంత్ ఇలా చేసాడు..అంటూ కామెంట్ చేస్తున్నారు. తెలిసి చేసారో తెలియక చేసారో కానీ ఈ పెళ్ళి కార్డు తో సుమంత్ పరువు మాత్రం పోయింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news