ప్రశాంతి.. ఒకప్పుడు టీవీ ఛానల్‌లో యాంకర్‌గా సత్తా చూపించింది. బుల్లి తెరపై యాంకర్ గా అడుగు పెట్టి ప్రేక్షకులను అలరించి… ఎఫైర్ సినిమాతో నటిగా మారి సిల్వర్ స్క్రీన్ పై అడుగు పెట్టింది. టాలీవుడ్ లో అవకాశాల కోసం గట్టిగానే కష్టపడింది. కానీ తగినంత గుర్తింపు దక్కలేదు. పొరుగు రాష్ట్రాల సరుకుకి బాగా అలవాటు పడ్డ మన దర్శక నిర్మాతలు యాంకర్ ప్రశాంతిలో మంచి టాలెంట్ ఉన్నప్పటికీ సరైన అవకాశం ఇవ్వడానికి చాలా సమయమే తీసుకున్నారు.
యాంకర్ ప్రశాంతి ను అందరూ మరచిపోతున్న సమయంలో స్టార్ మా ఛానల్‌లో ప్రసారం అవుతున్న ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ లో లాస్య పాత్రలో నటించి మళ్లీ ఫామ్ తెచ్చుకుంది. ఇందులో నందుకి భార్యగా తులసికి సవతిగా నెగిటివ్ రోల్‌లో .. కస్తూరి కంటే హావభావాలు బాగా పలికిస్తుంటుంది ప్రశాంతి. లాస్య పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టుగా ఆ పాత్రకి పర్ఫెక్ట్‌గా సూట్ కావడంతో ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ టాప్ రేటింగ్‌తో దూసుకుని పోతుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన సంబంధించిన ఫోటోలను బాగా షేర్ చేసుకుంటుంది ప్రశాంతి. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వారి కంటే బయట వారికి ఎక్కువ అవకాశాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇది ఎప్పటి నుంచో వస్తున్న కంప్లైంట్. కానీ ఎవరూ పట్టించుకోకుండా పెద్ద హీరోలు ఈ రకం హీరోయిన్లకే మొగ్గు చూపుతుంటారు.
అక్కడి వారిని ఇక్కడికి తీసుకువచ్చి అందలం ఎక్కించి వారిని స్టార్ హీరోయిన్ లు గా చేస్తూ ఉంటారు మన వారు. కానీ మన వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రశాంతి తెలుగు ఇండస్ట్రీ గురించి చేసీన కొన్ని కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
తెలుగు వాళ్లలో చాలా మంది టాలెంటెడ్ ఆర్టిస్ట్స్ ఉన్నారని.. వాళ్లందరినీ ఎంకరేజ్ చేస్తే వాళ్లు ఒక్కొక్కరూ ఒక్కో ఆణిముత్యాలే అవుతారని అన్నారు. అయితే పరాయి భాష నటులకు ఇచ్చే అవకాశాలను తెలుగు కళాకారులకు ఇవ్వడం లేదని.. వాపోయారు.
అవకాశం లేక చాలా మంది తమ టాలెంట్ను చంపుకుంటున్నారని, అలా అవకాశాలు లేక చాలా మంది డిప్రెషన్ లోకి వెళ్తుంటారని తెలిపింది. మరికొందరు అవకాశాలు లేక తమలోని టాలెంట్ ను పక్కన పెట్టి… పొట్ట కూటి కోసం వివిధ పనులు చేసుకుంటూ బతుకుతున్నారు అంటూ లాస్య ఆవేదన వ్యక్తం చేసింది.
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇతర భాషల హీరోయిన్ లను ఇండస్ట్రీకి వచ్చి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. వారికి అవకాశాలు ఇస్తూ ఉంటారు. అదే అవకాశాలను మంచి నటులను గుర్తించి ఇస్తే బాగుంటుందని .. ఇక్కడ చాలా మంది టాలెంట్ నటీనటులు ఉన్నారని ..ముందు తెలుగు వాళ్ళని ప్రోత్సహించి ఆ తర్వాత పరభాషా నటులకు వెళితే బాగుంటుంది అని చెప్పుకొచ్చారు ప్రశాంతి.