ప్రపంచ మహమ్మారి కరోనా ఎంతోమంది సెలబ్రిటీపై సైతం తన పంజా విసురుతోంది. ఇప్పటికే మన దేశంలో ఎంతో మంది రాజకీయ, సినిమా రంగాలకు చెందిన ప్రముఖులు కరోనా భారీన పడ్డారు. కొంత మంది మంత్రులు, మాజీ మంత్రులు, ప్రజా ప్రతినిధులను సైతం పొట్టన పెట్టుకుంది. ఇక సినిమా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు, స్టార్ హీరోలు, హీరోయిన్లు, దర్శకులు సైతం కరోనాకు గురయ్యారు. ఇటీవలే క్రేజీ హీరోయిన్ తమన్నా సైతం కరోనా భారీన పడి తిరిగి కోలుకున్న సంగతి తెలిసిందే.
ఇక ఇప్పుడు మరో స్టార్ హీరో సైతం కరోనా భారీన పడ్డారు. మళయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఇటీవలే కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతుండగా అనుమానంతో కరోనా పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని పృథ్విరాజ్ తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. పృథ్వి ప్రస్తుతం జనగణమణ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ టైంలోనే ఆయన కరోనాకు గురయ్యి ఉండవచ్చని తెలిపారు.