జ‌గ‌న్‌పై త‌న మెజార్టీ ఎంతో చెప్పిన ర‌ఘురామ‌… వైసీపీ మైండ్ బ్లాక్ అయ్యేలా..

వైఎస్సార్‌సీపీ న‌ర‌సాపురం ఎంపీ క‌నుమూరు ర‌ఘురామ కృష్ణంరాజు వైసీపీని, ఏపీ సీఎం జ‌గ‌న్‌ను వ‌ద‌ల‌కుండా ప్ర‌తి రోజు ఆటాడుకుంటున్నారు. తాజాగా ఆయ‌న మాట్లాడుతూ ఏపీ రాజ‌ధాని అమరావతి రిఫరెండంగా ఎన్నికలకు వెళ్తే త‌న‌పై సీఎం జ‌గ‌న్ పోటీ చేసినా కూడా తాను 2 ల‌క్ష‌ల మెజార్టీతో గెలుస్తానంటూ ర‌ఘురామ స‌వాల్ విసిరారు. ద‌మ్ముంటే జ‌గ‌న్ త‌న‌పై అమరావ‌తి రాజ‌ధాని అంశాన్ని రిఫ‌రెండ్‌గా తీసుకుని పోటీ చేయాల‌న్నారు.

 

 

అలాగే జడ్జి స్వామి రాసిన పుస్తకంలోని అంశాలను సాక్షి పేపర్ ప్రచురించడం అసంబద్ధం అన్నారు. మ‌త సంస్థ‌ల‌కు రాజ్యాంగం ప్ర‌కారం ప్ర‌భుత్వాలు నిధులు ఇవ్వ‌కూడ‌ద‌ని… ఇక పార్ల‌మెంట‌రీ స్టాండింగ్ క‌మిటీలో మ‌తం ప్ర‌కార‌మే నా ప‌ద‌విని వేరే ఎంపీకి క‌ట్ట‌బెట్టార‌ని ఆయ‌న చెప్పారు. అలాగే త‌న ఎంపీ ప‌ద‌విని ఎవ్వ‌రూ తొల‌గించ‌లేరు.. పార్టీ నుంచి త‌న‌ను ఎవ‌రు బ‌హిష్క‌రించ‌లేర‌ని ర‌ఘురామ సూటిగా తెలిపారు.

 

ఇక బ‌డా కాంట్రాక్ట‌ర్ల‌కు ఇసుక టెండ్ల‌ను అప్ప‌గించే క్ర‌మంలోనే ఉన్న ప్ర‌భుత్వం, బ‌ల‌వంతంగా సాక్షి పేప‌ర్‌ను అమ్మ‌డం కూడా స‌రికాద‌ని చెప్పారు. ఏదేమైనా ర‌ఘురామ నేరుగా జ‌గ‌న్‌పైనే 2 ల‌క్ష‌ల ఓట్ల మెజార్టీతో గెలుస్తానంటూ చేసిన స‌వాల్‌తో వైసీపీ నేత‌ల దిమ్మ‌తిరిగి పోతోంది. ఎవ‌రు ఆయ‌న‌కు కౌంట‌ర్ ఇచ్చినా ఆయ‌న అంత‌కు మించి స్ట్రాంగ్‌గా కౌంట‌ర్ ఇస్తున్నారు.