వియత్నాం దేశంపై ప్రకృతి పగ పట్టేసింది. ప్రకృతి ప్రకోపానికి ఈ దేశం గజగజ వణుకుతోంది. గత రెండు వారాలుగా ఇక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు కొండ చరియలు విరిగి పడడంతో ఇప్పటికే 90 మంది మృతి చెందారు. మరో 34 మంది గల్లంతు అయినట్టు అధికారులు తెలిపారు.
ఇక వియత్నాంలోని క్వాంగ్ ట్రై, తువా థియన్ హ్యూ, క్వాంగ్ నామ్ ప్రావిన్స్‌లలో అధిక ప్రాణనష్టం సంభవించిందని అధికారుల లెక్కలు చెపుతున్నాయి. పలు జాతీయ రహదారులు దెబ్బతిన్నాయి. స్థానిక రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సెంట్రల్ వియత్నంలోని పలు ప్రాంతాల్లో బుధవారం వరకు భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఏదేమైనా వియత్నాం ప్రకృతి ప్రకోపంతో విలవిల్లాడుతోంది.