వి – నిశ్శ‌బ్దం ఏ సినిమా హిట్ అంటే…!

నాని – సుధీర్‌బాబు జంట‌గా న‌టించిన వి సినిమా, అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన నిశ్శ‌బ్దం రెండు సినిమాలు లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయ్యాయి. వాస్త‌వంగా చూస్తే ఈ రెండు సినిమాల‌కు ప్లాప్ టాకే వ‌చ్చింది. రెండు ప్లాప్ అయినా రెండిట్లో ఏది కాస్త బెస్ట్ అన్న చ‌ర్చ‌ను నెటిజ‌న్లు లేవ‌నెత్తుతున్నారు. అయితే రెండు సినిమాల్లో ఉన్నంత‌లో అనుష్క నిశ్శ‌బ్ద‌మే బెస్ట్ అన్న టాక్ అయితే వ‌చ్చింది.

 

ఈ రెండిటిని కంపేరిజ‌న్ చేస్తే వీ సినిమా కంటే నిశ్శ‌బ్దం సినిమానే ఎక్కువ మంది చూశారు. ఉన్నంత‌లో ఇదే కాస్త బెస్ట్ అని ఎక్కువ మంది కామెంట్లు చేశారు. వీ సినిమా ఫ‌స్ట్ ఆట‌కే తెలిపోవ‌డంతో పాటు ఎక్కువ ర‌న్ టైం ఉండ‌డం.. భారీగా బోరింగ్ ఉంద‌ని కామెంట్లు వ‌చ్చేశాయి. అందుకే సుధీర్‌బాబు, నాని లాంటి వాళ్లు ఉన్నా కూడా వీ సినిమా ప్రేక్ష‌కుల‌కు ఎక్క‌లేదు.

 

వి సినిమా ట్రెండ్ రెండు, మూడు రోజుల‌కే చాప చుట్టేసింది. నిశ్శ‌బ్దం ట్రెండ్ ఇంకా కొన‌సాగుతూనే ఉంది. అందుకే ఈ రెండు సినిమాల్లో ఖ‌చ్చితంగా నిశ్శ‌బ్ద‌మే బెట‌ర్ అని చెప్ప‌క త‌ప్ప‌దు.