టీడీపీ కొత్త టీం ఇదే.. బాబు భ‌లే మెలిక పెట్టారే..

టీడీపీ కొత్త టీంను ఈ రోజు ప్ర‌క‌టించారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు పేరు, తెలంగాణ అధ్యక్షుడిగా ఎల్ రమణను ప్రకటించారు. వీరిలో ర‌మ‌ణ పాత నేతే కాగా ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీ టీడీపీ అధ్య‌క్షుడిగా ఉన్న క‌ళా వెంక‌ట్రావును ప‌క్క‌న పెట్టి అదే జిల్లాకు చెందిన అచ్చెన్న‌కు ప‌గ్గాలు ఇచ్చారు. ఇక 24 మందితో పొలిట్ బ్యూరో, 27 మందితో సెంట్ర‌ల్ క‌మిటీ ఏర్పాటు చేశారు. ఆరుగురిని వైస్‌ ప్రెసిడెంట్లుగా నియామించారు..సెంట్రల్‌ జనరల్ కమిటీ సభ్యులుగా మరో 8మందిని ప్రకటించారు.

 

తెలంగాణ టీడీపీ ఉపాధ్యక్షురాలిగా నందమూరి సుహాసిని నియ‌మించారు. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నారా లోకేష్, వర్ల రామయ్య, రామ్మోహన్‌నాయుడు, నిమ్మల రామానాయుడు, బీద రవిచంద్ర, కొత్తకోట దయాకర్‌రెడ్డి, నర్సింహులు, కంభంపాటి రామ్మోహన్‌రావు నియ‌మితులు అయ్యారు. ఇక టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులుగా ప్రతిభా భారతి, కాశీనాథ్, గల్లా అరుణ, సత్యప్రభ, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, మెచ్చా నాగేశ్వరరావులు ఉన్నారు.

 

కీల‌క‌మైన పోలిట్ బ్యూరోలో య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు, అశోక్‌ గజపతి రాజు, అయ్యన్న పాత్రుడు, కేఈ కృష్ణమూర్తి, చిన రాజప్ప, సోమిరెడ్డి, కాలవ శ్రీనివాసులు, బాలకృష్ణ, వర్ల రామయ్య, కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, బొండా ఉమా, ఫారూక్, గల్లా జయదేవ్, రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి, పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, అరవింద్‌కుమార్‌గౌడ్‌లు ఎంపిక‌య్యారు.

 

ఇక పొలిట్ బ్యూరోలో నారా లోకేష్, అచ్చెన్న, ఎల్.రమణలు కూడా సభ్యులుగా చోటు దక్కించుకున్నారు. ఏదేమైనా టీడీపీ కీల‌క నేత‌లు అంద‌రికి ఏదో ఒక కీల‌క ప‌ద‌వులే క‌ట్ట‌బెట్టిన చంద్ర‌బాబు ఎవ్వ‌రూ అలిగే అవ‌కాశం ఇవ్వ‌లేదు.