స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సంక్రాంతికి వచ్చిన అల వైకుంఠపురంలో సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో బన్నీ క్రేజ్ మామూలుగా లేదు. ఇప్పుడు బన్నీ సౌత్ ఇండియా సూపర్ స్టార్‌గా మారిపోయాడు. కరోనా లాక్‌డౌన్ వల్ల ఆరు నెలలుగా షూటింగ్‌కు గ్యాప్ రావడంతో ఇప్పుడే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం అడవుల్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు.
బన్నీ మాత్రం వచ్చే సమ్మర్ నాటికి షూటింగ్ ఫినిష్ చేసి రిలీజ్ చేయాలని సుకుమార్‌కు కండీషన్ పెట్టాడట. అయితే సుకుమార్ మాత్రం 2021 ఎండింగ్ వరకు షూట్ చేసి 2022 సంక్రాంతి రేసులో సినిమాను ఉంచాలని చూస్తున్నాడట. సుకుమార్ సినిమాను లేట్ అయినా బాగా చెక్కుకు రావాలని చూస్తున్నా బన్నీ మాత్రం వచ్చే సమ్మర్‌కే రిలీజ్ చేసేలా షూటింగ్ పినిష్ చేయాలని కండీషన్ పెడుతున్నాడట.
సమ్మర్‌లో పుష్ప రిలీజ్ అయితే ఆ వెంటనే కొరటాల శివ సినిమాకు సిద్ధం అయ్యేలా బన్నీ ప్లాన్ చేస్తున్నాడు. ఈ విషయంలో బన్నీకి, సుకుమార్‌కు మధ్య చిన్న డిష్కర్షన్స్ నడుస్తున్నాయన్న టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇంకా సెట్స్ మీదకు వెళ్లకుండానే దర్శకుడు, హీరోకు మధ్య డిస్కర్షన్స్‌పై న్యూస్ రావడం బన్నీ ఫ్యాన్స్‌లో ఆందోళన కలిగిస్తోంది. మరి వీరిద్దరు చివరకు ఎలా డిసైడ్ అవుతారో ? చూడాలి.