ప్రపంచంలో చాలా దేశాలకు ప్రధాన ఆదాయ వనరు మద్యం అమ్మకాలు. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాల ద్వారా విపరీతమైన ఆదాయం సమకూరుతుంది. అయితే ఏపీలో జగన్ దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తానని చెప్పారు. ఈ ప్రభావం తెలంగాణలో మద్యం అమ్మకాలపై పడింది. తెలంగాణలో మద్యం అమ్మకాలు విపరీతంగా పెరగడంతో పాటు ఏపీకి దొడ్డిదారిలో మద్యం సరఫరా చేస్తున్నారు.
మద్యపాన నిషేధం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్నే అనర్థాలు కూడా ఉన్నాయని 1920లో అమెరికాలో జరిగిన సంఘటన రుజువు చేస్తోంది. 1920లో అమెరికాలో మద్యపాన నిషేధం విధించారట. అప్పటికే మద్యానికి పిచ్చి పిచ్చిగా బానిసలు అయిన వారు మద్యం దొరక్క శానిటైజర్, ఇతర ఆల్కాహాల్ అధారిత కెమికల్స్‌ను విపరీతంగా సేవించారట.
పెయింట్లు, ఇథైల్ ఆల్కాహాల్ కెమికల్స్ తీసుకోవడంతో అయితే ప్రభుత్వం చివరకు వీటిని కూడా బ్యాన్ చేసింది. అయితే ఇలాంటి కెమికల్ మిక్స్ అయిన మిథైల్ ఆల్కాహాల్ తాగిన వారు అప్పట్లోనే పదివేల మందికి పైగా చనిపోయారట. చివరకు అప్పటి అమెరికా అధ్యక్షుడు ఫ్ల్రాంక్లిన్ రూజ్వెల్డ్ మద్యపాన నిషేధం ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. ఇది అమెరికా చరిత్రలోనే ఘోరమైన విషాదం.