సమాజంలో రోజు రోజుకు వివాహేతర సంబంధాలు ఎక్కువ అవుతున్నాయి. వీటి వల్ల ఎన్ని అనార్థాలు జరుగుతున్నా ప్రజలు మాత్రం శారీరక సుఖం కోసం వేరే వాళ్లతో సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఓ హోటల్ గదిలో ఓ ఏఆర్ కానిస్టేబుల్ ఓ బ్యూటీషియన్ అయిన వివాహితతో సంబంధం పెట్టకుని రాసలీలలు చేస్తుండగా భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టేశాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. రాయదుర్గంలో ఓ వివాహిత బ్యూటీపార్లర్‌లో పని చేస్తోంది.
అయితే ఆమె ఓ ఏఆర్ కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న భర్త ఆమెపై నిఘా పెట్టాడు. సోమవారం కూడా ఆమె బ్యూటీపార్లర్‌కు వెళుతున్నానని భర్తకు చెప్పి కానిస్టేబుల్‌తో కలిసి హోటల్లో రాసలీలల కార్యక్రమం కొనసాగిస్తోంది. ఈ విషయం గమనించిన భర్త పోలీసులకు ఈ విషయం చెప్పి వారితో సహా వెళ్లి వారిద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టేశాడు.
భర్త తలుపు తట్టగా గొంతు గుర్తు పట్టిన ఆమె బాత్ రూంలోకి వెళ్లి దాక్కుంది. పోలీసులు తలుపులు బలవంతంగా తెరచి చూడగా వారిద్దరు ఉన్నారు. తన భార్య బ్యూటీషియన్‌గా చేస్తున్నానంటూ కానిస్టేబుల్‌తో ఎఫైర్ పెట్టుకుందని.. తన భార్యకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి అతడు తన భార్యను బుట్టలో వేసుకుని ఎఫైర్ పెట్టుకున్నాడని ఆ మహిళ భర్త వాపోయాడు. పోలీసులు వారిద్దరిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.