Newsఖ‌మ్మం జిల్లాలో కొట్టుకుపోయిన తండ్రి, కొడుకు...

ఖ‌మ్మం జిల్లాలో కొట్టుకుపోయిన తండ్రి, కొడుకు…

భారీ వ‌ర్షాలు రెండు తెలుగు రాష్ట్రాల‌ను ముంచెత్తుతున్నాయి. ప‌లు చోట్ల తీవ్రంగా పంట న‌ష్టం ఉంది. బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప పీడ‌న ప్ర‌భావంతో కోస్తా ఆంధ్రాతో పాటు తెలంగాణ‌లోని కొన్ని జిల్లాల్లోనూ భారీ వ‌ర్షాల కురుస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఖ‌మ్మం జిల్లాలో చెరువు అలుగు పొంగి తండ్రి, కొడుకులు కొట్టుకుపోయారు. స‌త్తుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని పెనుబ‌ల్లి మండ‌ల కేంద్రంలో రాధోనీ చెరువు అలుగు పొంగుతోంది.

 

చెరువు అలుగు పొంగుతుండ‌గానే.. తండ్రి కొడుకులు త‌మ బైక్‌పై ఈ అలుగు దాటాల‌ని చూశారు. ఈ క్ర‌మంలోనే వ‌ర‌ద ఉధృతికి తండ్రికొడుకులు ఇద్ద‌రు కొట్టుకుపోయారు. చెరువుకు అవ‌త‌ల వైపు ఉన్న త‌మ పొలంలోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నించ‌గా వీరు బైక్‌తో స‌హా దిగువ‌కు కొట్టుకుపోయారు. వీరిలో కుమారుడు ఈదుకుంటూ ఒడ్డుకు రాగా.. తండ్రి గ‌ల్లంతైన‌ట్టు తెలుస్తోంది.

 

ఈ విష‌యం తెలియ‌డంతో గ్రామ‌స్తులు అక్క‌డ‌కు చేరుకుని గాలిస్తున్నారు. పోలీసులు సైతం సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ప‌రిస్థితి స‌మీక్షిస్తున్నారు. చెరువు అలుగు ఉధృతంగా ప్ర‌వ‌హిస్తుండ‌డంతో కింద వెత‌క‌డం క‌ష్టంగా ఉంద‌ని స్థానికులు చెపుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news