వివాహేతర సంబంధం ఓ వ్యక్తి హత్యకు కారణమైంది. వివాహేతర సంబంధాలు ఎన్నో కాపురాలను కూలుస్తున్నా.. ఎంతో మంది హత్యకు కారణం అవుతున్నా చాలా మంది వివాహేతర సంబంధాలు పెట్టుకుంటూనే ఉన్నారు. తాజాగా తెలంగాణలోని భూత్పూర్ మునిసిపాలిటీలో అమిస్తాన్పూర్ గ్రామంలో జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అమిస్తాన్పూర్కు చెందిన మల్లేష్, భార్య, ఇద్దరు పిల్లలతో నివసిస్తుండేవాడు.
మల్లేష్ భార్య అదే గ్రామానికి చెందిన శ్రీహరి ( 43)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వీరి సంబంధం బయటకు వస్తే కలిసి ఉండలేమని డిసైడ్ అయిన వీరిద్దరు పదేళ్ల క్రితమే గోవాకు వెళ్లిపోయారు. శ్రీహరి , మల్లేష్ భార్య గోవాలోనే కాపురం ఉంటున్నారు. దీంతో మల్లేష్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. శ్రీహరి అమిస్తాపూర్కు వారం రోజుల క్రితం వచ్చాడు. శుక్రవారం మల్లేష్, శ్రీహరి ఎదురు పడ్డారు.
ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య జరిగిన గొడవలో శ్రీహరి రాయిపై పడటంతో గాయాలయ్యాయి. గమనించిన మల్లేష్ పక్కనే ఉన్న రాయిని తీసుకుని శ్రీహరి తలపై కొట్టి చంపేశాడు. అనంతరం మల్లేష్ స్వయంగా భూత్పూర్ పోలీస్టేషన్లో లొంగిపోయాడు. పోలీసులు సంఘటనా స్థలం సందర్శించి దర్యాప్తు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.