Moviesబిగ్‌బాస్‌లో ఈ వారం ఎలిమినేష‌న్ ఎవ‌రో తేలిపోయింది... ఆ కంటెస్టెంట్ ఇంటికే...!

బిగ్‌బాస్‌లో ఈ వారం ఎలిమినేష‌న్ ఎవ‌రో తేలిపోయింది… ఆ కంటెస్టెంట్ ఇంటికే…!

బిగ్‌బాస్‌లో ఈ వారం హౌస్ నుంచి ఎవ‌రు ?  బ‌య‌ట‌కు వ‌స్తారు ? ఇక ఈ వారం హౌస్ నుంచి ఎవ‌రు బ‌య‌ట‌కు వ‌స్తార‌న్న దానిపై కూడా లీకు వీరుల గుస‌గుస‌లు అప్పుడే స్టార్ట్ అయిపోయాయి. ఇక ఎక్కువుగా నామినేష‌న్ల‌లోకి వెళ్లి సేఫ్ అవుతోన్న అభిజిత్‌కు ఈ సారి కూడా ఎక్కువ ఓట్లు రావ‌డంతో అత‌డు సేఫ్ అయ్యాడంటున్నారు. ఇక అభిజిత్ త‌ర్వాత అఖిల్ కూడా సేఫ్ అయ్యాడ‌నే తెలుస్తోంది.

 

 

లాస్య కూడా ప్రేక్ష‌కుల సపోర్ట్‌తో సులువుగానే ఎలిమినేష‌న్ గండం నుంచి బ‌య‌ట ప‌డిందంటున్నారు. ఆమె ఎలిమినేష‌న్లోకి వ‌చ్చిన రీజ‌న్ ప్రేక్ష‌కుల‌కు ఎంత మాత్రం న‌చ్చ‌లేద‌ట‌. ఆమె చేసిన ప‌ప్పు కూర వ‌ల్ల ఇంటిస‌భ్యుల‌కు మోష‌న్స్ అవుతున్నాయ‌న్న కార‌ణం జ‌నాల‌కు ఏ మాత్రం న‌చ్చ‌క‌పోవ‌డంతో ఆమెకు భారీగా ఓట్లు వేసి ఆమెను సేవ్ చేశారంటున్నారు. ఇక మిగిలిన వాళ్ల‌లో మోస‌గాళ్ల‌కే మోస‌గాడు అన్న ముద్ర వేయించుకున్న అమ్మ రాజ‌శేఖ‌ర్ మాస్ట‌ర్‌తో పాటు జోర్దార్ సుజాత ఇప్పుడు డేంజ‌ర్ జోన్లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

 

 

అమ్మ రాజ‌శేఖ‌ర్ ప్ర‌తి విష‌యంలోనూ త‌న‌కు మాత్ర‌మే తెలుస‌న్న‌ట్టు మిగిలిన వాళ్ల‌పై జులుం ప్ర‌ద‌ర్శిస్తుండ‌డంతో ఇప్ప‌టి వ‌ర‌కు అత‌డిని భ‌రించిన వాళ్లు ఇప్పుడు అత‌డికి ఓట్లేసేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేదు. ఇక జోర్దార్ సుజాత ప్ర‌తిదానికి ఓవ‌ర్‌గా న‌వ్వుతోన్న తీరు చాలా మందికి న‌చ్చ‌డం లేదు. ఆమె న‌వ్వు కావాల‌ని నువ్వుతోందా ?  న‌వ్వు వ‌చ్చి న‌వ్వుతోందో కూడా ఎవ్వ‌రికి అర్థం కావ‌డం లేదు. పైగా నాగ్‌ను బిట్టు  అని పిల‌వ‌డం నాగ్‌కు ఎలా ?  ఉన్నా నాగ్‌, బిగ్‌బాస్ అభిమానుల‌కు న‌చ్చ‌డం లేదు.

 

 

పైగా గాసిప్‌ల రాణి అయిన ఆమెను ఈ వారం బ‌య‌ట‌కు పంపించేయాల‌ని చాలా మంది డిసైడ్ అయ్యార‌ట‌. ఏదేమైనా ఈ వారం త‌క్కువ ఓట్లు వ‌చ్చిన వారిలో మాస్ట‌ర్ రాజ‌శేఖ‌ర్‌, సుజాత ఉన్నార‌ని.. వీరిలో సుజాత‌కు త‌క్కువ ఓట్లు రావ‌డంతో ఆమె హౌస్ నుంచి అవుట్ అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news