ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం. కీరవాణి అరుదైన ఎంఎస్ (మల్టిపుల్ సెలిరోసిస్) అనే వ్యాధితో బాధపడుతున్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఓ వీడియోను కూడా కీరవాణి పోస్ట్ చేశారు. ఈ వ్యాధి ఏ వయస్సు వారికి అయినా.. ఎప్పుడు అయినా రావొచ్చని అంటున్నారు. ఈ వ్యాధి మనిషి శరీరానికి, మెదడుకు ఉన్న అనుసంధాన వ్యవస్థను దెబ్బతీస్తోందట.
ఇక ఈ వ్యాధిపై ఎంఎస్ ఇండియా సంస్థ ప్రజల్లో అవగాహన కూడా కల్పిస్తోంది. ఇక ఈ వ్యాధిపై కీరవాణి మాట్లాడుతూ ఈ సమస్యతో బాధపడే వారికి కుటుంబ సభ్యుల నుంచి మద్దతు ఎంతో అవసరం అని చెప్పారు. ఇక ఈ వ్యాధి ఉన్న వారు యోగా సాధన చేయడంతో పాటు మంచి సంగీతం వినడంతో పాటు అన్ని రకాలుగా మనో ధైర్యంతో ఉండాలని సూచించారు.ఇక ఒకటి కంటే ఎక్కవ సార్లు దానం చేస్తే ఎటువంటి ప్రమాదం లేదని ఆయన తెలిపారు.