క‌ర్నూలు జిల్లాలో దారుణం.. ఇంజ‌నీర్‌ను చంపేసిన తేనెటీగ‌లు

క‌ర్నూలు జిల్లాలో దారుణం జ‌రిగింది. తేనెటీగ‌ల దాడిలో ఓ ఇంజ‌నీర్ చ‌నిపోయాడు. క‌ర్నూలు జిల్లాలోని బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ వద్ద ఈ విషాదఘటన చోటుచేసుకుంది. బ‌న‌క‌చ‌ర్ల హెడ్ రెగ్యులేట‌ర్ వ‌ద్ద విధుల నిర్వ‌హ‌ణ‌లో ఉండ‌గా ఆయ‌న‌పై తేనెటీగలు దాడి చేశాయి. డివిజినల్ ఇంజనీర్ భానుప్రకాష్ హెడ్ రెగ్యులేటర్ వద్ద ఎస్‌ఆర్‌బీసీ గేట్ల తనిఖీ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

 

ఆయ‌నపై తేనెటీగ‌లు దాడి చేయ‌డంతో ఆయ‌న ఒక్క‌సారిగా కుప్ప‌కూలిపోయాడు. దీంతో మృతుని కుటుంబీకులు కన్నీరుమున్నీగా రోదిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఏదేమైనా విధి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న ఇంజ‌నీర్ తేనెటీగ‌ల దాడిలో ప్రాణాలు కోల్ప‌వ‌డంతో స‌న్నిహితులు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Leave a comment